సంగారెడ్డి : 50 కోట్లు విలువచ్చేసే ప్రభుత్వ భూమిని అక్రమ డాక్యూమెంట్ కబ్జాదారుల నుండి కాపాడండి కలెక్టర్ కార్యాలయo ముందు ధర్నా బీరంగూడ గ్రామ ప్రజలు అమీన్ పూర్ మున్సిపల్ బీరంగూడ లో 993 సర్వే నెంబర్ ప్రభుత్వ భూమిలో అక్రమ దస్తావేజు లతో 842.844 సర్వే నెంబర్ వేసుకొని తప్పుడు దస్తావేజు లతో 5000 వేల గజాలు సుమారు 50 కోట్లు విలువ చేసే ప్రభుత్వ భూమిని కాపాడాలని బీరంగూడ గ్రామ పెద్దలు అడెల్లి రవీందర్ కొకలా శ్రీనివాస్ నందరం రమేష్ గౌడ్ ఇండ్రేషం ప్రకాష్ ఏడ్ల మల్లేష్ మకాం మల్లేష్ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ముందు బీరంగూడ గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించి కలెక్టర్ కు మెమోరాండం సమర్పించారు. ఈసందర్బంగా బీరంగూడ గ్రామ పెద్దలు మాట్లాడుతూ తప్పుడు డాక్యూమెంట్ల తో కోట్ల రూపాయలు విలువ జేసే ప్రభుత్వ భూములు కబ్జా చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకొని కఠినంగా శిక్షించాలని తక్షణమే అక్రమంగా నిర్మించి ప్రహరీ గోడను తొలగించాలని డిమాడ్ చేశారు. 842 844 సర్వే నెంబర్ తో ప్రభుత్వ భూముల్లో రేజిస్టర్ చేస్తున్న వారిపై మరియు సబ్ రీజస్టర్ పై చర్యలు తీసుకొని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమం లో గ్రామ పెద్దలు అదేల్లి రవీందర్, నందరం రమేష్ గౌడ్ కొకలా శ్రీనివాస్ ఇండ్రేషం ప్రకాష్ ఏడ్ల రాజమల్లేష్ మకాం మల్లేష్ చిన్న వీరేశం శంకర్ బంటు రమేష్ బంటు ప్రవీణ్ పెద్ద వీరేశం బంటు శివ జ్ఞానేశ్వర్ నవీన్ మొదలగు వారు పాల్గొన్నారు.