- అల్లూరి జిల్లా కేంద్రంలో తప్పని ఆక్రమణలు !
- రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసిన సిబ్బంది
అల్లూరి జిల్లా : ప్రాథమిక వ్యవసాయ పరపతి సహకార సంఘం భూమిని ఒక ప్రజా ప్రతినిధి అక్రమం ఆక్రమించేందుకు చేస్తున్న ప్రయత్నాలు పలువురిని కలవరపెడుతున్నాయి. నూతనంగా ఏర్పడిన అల్లూరి సీతారామరాజు జిల్లా కేంద్రం లో జరుగుతున్న సంఘటనపై పలువురు గిరిజనులు భయాందోళనకు గురవుతున్నారు. ఒక సహకార సంఘానికి చెందిన భూమిని కబ్జా చేస్తున్నారంటే సామాన్యుల భూముల పరిస్థితి ఏంటి అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అల్లూరి జిల్లా కేంద్రంలోని పోస్ట్ ఆఫీస్ వెనుక మయూరి లాడ్జి పక్కన ప్రాథమిక వ్యవసాయ పరపతి సహకార సంఘానికి 0.12 సెంట్లు భూమి కలదు. ఈ భూమిని పంచాయితీ ఉపసర్పంచు కాజేసేందుకు యత్నాలు చేస్తున్నారని తహశీల్దార్ కి పిఎసిఎస్ సిబ్బంది పిర్యాదు చేసారు. దీంతో ఈ సంఘటన వెలుగు చూసింది. సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. నూతనంగా గొడౌన్ మరియు కార్యాలయం 33 లక్షలతో నిర్మాణం కట్టేందుకు విశాఖపట్నం డి సి సి బీ నుంచి నిధులు విడుదల అవ్వడంతో అక్కడ నిర్మాణం చేసేందుకు తగు ఏర్పాట్లు చేసేలోపే పాడేరు పంచాయతీ ఉపసర్పంచు కొలతలు నిర్వహించారు. అది చూసి ఇది సొసైటీ కి సంబంధించిన స్థలం ఇక్కడ నిర్మాణం చేపట్టకూడదని సొసైటీ సిబ్బంది చెప్పారు. ఇది గ్రామ కంఠం భూమి ఇక్కడ పంచాయతీ కి సంబంధించిన గొడౌన్ కడుతున్నామని బదులిచ్చారు. పునాది తియ్యడం మొదలుపెట్టారు. గమనించిన సిబ్బంది వెంటనే తహశీల్దార్ ,జిల్లా అధికారులకు పిర్యాదు చేసారు. పంచాయతీ పరిధిలో ఇలాంటి గొడౌన్ కట్టాలన్నప్పుడు స్థానిక సర్పంచ్,లేదా కార్యదర్శి దగ్గర ఉండి నిర్మాణం చెప్పటాలి కానీ ఉప సర్పంచ్ దగ్గర ఉండి చేపట్టడం చాలా విడ్డురంగా ఉంది . జిల్లా కేంద్రం లోనే ఇంత ధైర్యంగా ఆక్రమించి నిర్మాణం చేపట్టేందుకు ఉప సర్పంచ్ ప్రయత్నిస్తున్నారంటే దీని వెనుక ఎవరున్నారనేది తెలయాల్సి ఉంది. ఈ ఆక్రమణపై లోతుగా దర్యాప్తు జరిగితే అసలు విషయాలు వెలుగు చూస్తాయి. తమ స్థలాన్ని కాపాడి తమకు అప్పగించాలని పిఎసిఎస్ సిబ్బంది అధికారులను కోరుతున్నారు. అధికారులు ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాల్సిందే.