- రాజకీయ, అధికారుల ప్రద్భలంతో వేరే వారి పేరుతో ఆన్లైన్ లో నమోదు
- సర్వే నెంబర్ 40లో ఒక నిరుపేద గిరిజనుడు భూమి స్వాహా
- ఇదేమని అడిగితే కోర్టులో తేల్చుకోమని ఉచిత సలహా ఇచ్చిన తహసీల్దార్
వికారాబాద్ జిల్లా: సమాజంలో జరుగుతున్న అవినీతి,అక్రమాలను వెలికితిస్తే చేసిన తప్పులను ప్రజలందరికీ తెలియజేస్తే సదరు వ్యక్తులకు ఆగ్రహం రావడం సహజమే. కానీ పేదవాడి భూమిని కబ్జా జరిగితే తప్పు చేసినట్టు అధికారులకు తెలిసిన కానీ పైకి మేకపోతు గాంభీర్యం ప్రదర్శించడం వారికి వెన్నతో పెట్టిన విద్య అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వికారాబాద్ జిల్లా మండలం చౌడాపూర్ గ్రామం మక్తా వెంకటాపూర్ లో ఆన్లైన్ ఎంట్రీ చేసుకుని పేదవాడి కడుపుకొడుతున్న బాగోతం బయడపడింది. వివరాల్లోకి వెళితే మక్తా వెంకటాపూర్ గ్రామము కొత్తపల్లి తండా నివాసి అయిన సభావత్ బీల్యా తండ్రి పేరు కండ్య కు మక్తా వెంకటాపూర్ గ్రామా పంచాయతీ పరిధిలో సర్వే 40 లో సుమారు 32 గుంటల భూమి 1989 లో నజరున్నీసా బేగం భర్త మోహ్హమద్ ఆలీ వారి నుండి బీల్యా పూర్వికులు కొని వారి పూర్వికులతో పాటు సాగు చేసుకుంటున్నారు. కానీ 2019 సంవత్సరంలో బీల్యా పేరు మీద ఉన్న భూమి ఎవరికీ అమ్మకుండానే, బీల్యా కు తెలియకుండానే ఆ భూమి కుల్కచర్ల మండలం మక్తా వెంకటాపూర్ గ్రామానికి చెందిన విస్లావత్ దొడ్యా తండ్రి టీక్యా పేరు.. ఎలాంటి సంబంధం లేకపోయినా ఆన్లైన్ రికార్డులో చూపిస్తుంది. తహసీల్దార్ చౌడాపూర్ దగ్గరికి వెళ్లి అడిగితె మాకు ఎలాంటి సంబంధం లేదని, ఇది కుల్కచర్ల మండలం కింద వస్తుందని, తహసీల్దార్ హసీనా బేగం, వీఆర్వో భీమయ్యే, లింగం, ఆర్.ఐ. ఉన్న సమయంలో జరిగిందని ఈ భూమి మీకు కావాలంటే కోర్టులో పోరాటం చేయమని సలహా ఇవ్వడం జరిగింది.
ఈ విషయం పై బాధితుడు వికారాబాద్ జిల్లా కలెక్టర్ కి , జిల్లా ఎస్పీ కి , ఆర్డీవో కి , ఎమ్మార్వో కి విన్నవించుకున్నా పట్టించుకోవడం లేదు. పేదవాడు కోర్టుకు డబ్బు ఖర్చుపెట్టి కోర్టులకు వెళ్ళగలరా ? ఆలోచించాలి ఒకసారి అధికారులు. ఇకనైనా అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని బాధితుడు అధికారులను కోరుతున్నాడు.