కరీంనగర్ జిల్లా: గన్నేరువరం మండల కేంద్రంలోని 301/బి సర్వే నంబర్లు గల భూమిని అమ్మ రాదు కొనరాదు ఇది సిలింగ్ భూమి అంటూ రెవెన్యూ పంచాయతీ అధికారులు మంగళవారం ఆస్థానంలో ప్లెక్సీ ఏర్పాటు చేశారు. కాగా కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఈ భూమిని కొనుగోలు చేసి ప్లాట్లుగా విభజించి విక్రయిస్తున్నట్లు అధికారుల దృష్టికి రావడంతో ఫ్లెక్సీ ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ఈ స్థలంలో అధికారులు ఏర్పాటు చేసిన అనంతరం గుర్తుతెలియని వ్యక్తులు దానిని కింద పడేశారు. దీనిపై సంబంధిత అధికారులు ఏమి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి.