- ఆక్రమణకు గురైన చీమకుర్తి క్రిస్టియన్ పాలెం స్మశాన వాటిక.
- పలుమార్లు అధికారుల దృష్టికి వెళ్లినా పట్టించుకోని అధికారులు.
- స్థానిక నాయకుల ప్రేక్షక పాత్ర.
ప్రకాశం జిల్లా, చీమకుర్తి : శవాలపై నాణేలు ఏరుకోవడం అంటే ఇదేనేమో .. ! కనిపించిన భుమునులల్లా కబ్జా చేయడమే కాకా స్మశానాలను కూడా వదలడం లేదు. మృతదేహాలను ఖననం చేసిన స్థలాలను తవ్వి వెంచర్లు వేసి మరీ విక్రయిస్తున్నారు. భూ దాహానికి అడ్డూ అదుపూ లేకుండా పోతోంది. చెరువులు, కాలువలు, గోర్జీలు అని చూడడం లేదు. ప్రభుత్వ భూమి అంటే లెక్కలేదు. చివరికి శ్మశానాలను సైతం వదలడం లేదు. తాజాగా చీమకుర్తిలో ఇటువంటి భూ కబ్జా ఘటనే వెలుగులోకి వచ్చింది. చీమకుర్తి మున్సిపాలిటీ పరిధిలోని క్రిస్టియన్ పాలెం స్మశాన వాటిక ఆక్రమణకు గురైందని ఆరోపణలు లేకపోలేదు. మనిషి అంత్యక్రియలకు అంత భూమి ఎందుకని భావించారో.. లేక తమకు అడ్డేలేదని అనుకున్నారో మరుభూమిని పంట భూమిగా మార్చేశారు. దీంతో రైతుల మాటున కొంచెంకొంచెం ఆక్రమించడం ప్రారంభించారు. ఇదేమని ప్రశ్నించే స్థానికులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. స్థానికులు కొందరు ఫిర్యాదు చేసినప్పటికీ గత ప్రభుత్వంలో నామమాత్రపు సందర్శన చేసిన స్థానిక అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. నిర్లక్ష్యానికి ప్రధాన కారణం రాజకీయపరమైన కారణాలవటం గమనార్హం. ఇకనైనా ఉన్నతాధికారులు స్పందించి తగు చర్యలు తీసుకుంటారా ! .. లేదా ! .. వేచి చూడాలి.