- లంచాలు తీసుకుని మౌనం వహిస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు అధికారులు
- లక్షల విలువ చేసే ప్రభుత్వ ఆస్తులు కబ్జాకు గురవుతున్న పట్టించుకోని జిల్లా ఉన్నతాధికారులు
తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలంలో విలువైన ప్రభుత్వ భూమిని టిడిపికి చెందిన చోటా నాయకుడు అక్రమాంగా కాబ్జా చేస్తున్న పట్టించుకోవలసిన అధికారులు మాత్రం నిద్రావస్థలో ఉన్నారు. ఇటీవల కాలంలో మండల కేంద్రంలోని దినసరి కూరగాయల మార్కెట్ పక్కన కాలువపై అక్రమంగా షెడ్డు నిర్మించిన అధికారులు చూసి చూడనట్లు వ్యవహరించారు. ఈ కబ్జాకు సంబంధించి పలు పత్రికల్లో వార్తలు ప్రచురితమైన అధికారుల్లో మాత్రం చలనం రాలేదు. అక్రమంగా నిర్మించిన షెడ్డును తొలగించడానికి ఎలాంటి చర్యలు చేపట్టలేదు. కబ్జాదారులు కబ్జాలకు పాల్పడుతున్న ప్రభుత్వం నుంచి వేలకు వేలు జీతాలు తీసుకుంటున్న అధికారులు మాత్రం విధులు నిర్వహించకుండా టిడిపి చోటా నాయకుడుకి తమ సహాయ సహకారాలు అందిస్తున్నారు. మండల స్థాయిలో ప్రభుత్వ భూములను కాపాడాల్సిన అధికారులు లంచాల మత్తులో మునుగుతుంటే వారిని పర్యవేక్షించాల్సిన జిల్లా స్థాయి అధికారులు పూర్తిగా విఫలమయ్యారు. అధికారులు తమ విధులు సక్రమంగా నిర్వహించకుండా అక్రమ మార్గంలో నాయకులకు దళారులుగా వ్యవహరిస్తున్న జిల్లా స్థాయి అధికారులు వారిపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు అని ప్రజలు తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. మండల స్థాయి అధికారులతో పాటు జిల్లా స్థాయి అధికారులకు కూడా రాజకీయ నాయకులు లంచాలు అందజేశారని ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. లంచాలు తీసుకోకపోతే కబ్జాలను అడ్డుకొని ఉండేవారేమోనని ప్రజలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. కాలువ పైన అక్రమ నిర్మాణాలు చేపట్టిన టిడిపి నాయకుడిని ఎదురించే దమ్ము లేక ప్రభుత్వ అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు. ఇప్పటికైనా అక్రమ కబ్జాలపై జిల్లా అధికారులు దృష్టి సారించి అక్రమ నిర్మాణాలను తొలగించకపోతే మిగిలిన కాలువ పైన కూడా మరికొందరు అధికార పార్టీ కబ్జాదారులు కబ్జాలు చేసే అవకాశం లేకపోలేదని ప్రజలు వాపోతున్నారు. కాలువపై అక్రమ నిర్మాణాలను అడ్డుకొని సంబంధిత ప్రభుత్వ అధికారులను వెంటనే ఉద్యోగం నుంచి సస్పెండ్ చేయాలని ప్రజలు కోరుతున్నారు.