సిద్దిపేట జిల్లా: ది రిపోర్టర్ టీవీ: బెజ్జంకి మండల కేంద్రంలో లోకాయుక్త తెలంగాణ రాష్ట్ర ఇన్వెస్టిగేషన్ స్పెషల్ ఆఫీసర్ మాథ్యూ కోశాయ్ బుధవారం పర్యటించి, మండల కేంద్రంలో బెజ్జంకి రెవెన్యూ గ్రామంలో సర్వే నంబర్ 606/2 లో లింగాల తిరుపతి నిర్మించిన ఇంటి నిర్మాణం పూర్తిగా అక్రమ నిర్మాణంగా జిల్లా పంచాయతీ అధికారి( డిపిఓ ), స్థానిక తాసిల్దార్ వెంకట్ రెడ్డి, స్థానిక ఎంపీడీవో దమ్మాని రాము, గ్రామ కార్యదర్శి, ఆర్&బి, ఏ ఈ, ఫిర్యాదారుడు ఉప్పులేటి బాబు మరియు గ్రామస్తులను విచారించి ఇట్టి నిర్మాణం పూర్తిగా అక్రమ నిర్మాణముగా తేల్చి, తగు చర్యలకై స్థానిక అధికారులకు, జిల్లా డిపిఓ కు నివేదిక సమర్పిస్తూ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ మాట్లాడుతూ ప్రభుత్వ అధికారులు ఇట్టి అక్రమ నిర్మాణాల పట్ల ఉక్కు పాదం మోపి ప్రభుత్వ యంత్రాంగం మరియు ప్రభుత్వ అధికారుల పట్ల ప్రజలకు నమ్మకాన్ని కలిగించాలని అధికారులకు సూచించారు.
న్యాయం గెలిచింది.. ఫిర్యాదారుడు ఉప్పులేటి బాబు
లోకాయుక్త ఫిర్యాదారుడు ఉప్పులేటి బాబు మాట్లాడుతూ నా న్యాయమైన రెండు సంవత్సరాల పోరాటానికి అధికారుల స్పందించినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ, ప్రభుత్వ భూములు ఇల్లు లేని నిరుపేదలకు కేటాయించాలని ఉద్దేశంతో ఫిర్యాదు చేశాను తప్ప ఇట్టి ఫిర్యాదులో నాకు ఎలాంటి వ్యక్తిగతమైన కక్ష ఉద్దేశం లేదని పేర్కొన్నారు.