contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

500 కోట్ల … ప్రభుత్వ భూమికి కబ్జా !

  • 500 కోట్ల ప్రభుత్వ భూమికి ఎసరు
  • కాందిశీకుల భూమి…. మరోసారి కబ్జా
  • నాడు ప్రధాని మోడీ జోక్యంతో…..ఆగిన అక్రమ దందా
  • నేడు దొడ్డిదారిన అదే భూమికి….మళ్లీ అనుమతులు
  • 9 ఏండ్లకు మళ్లీ ల్యాండ్ మాఫియా అక్రమ దందా…. షురూ
  • లే అవుట్ అనుమతులను రద్దు చేయాలని కలెక్టర్ కు…. నేనుసైతం ఫిర్యాదు
  • అక్రమమమైతే లేఔట్ అనుమతులను రద్దు చేస్తాం… కలెక్టర్ రవి నాయక్ హామీ
  • కాందిశీకుల భూమిని కాపాడే వరకు పోరాడుతా…సామాజిక కార్యకర్త దిడ్డి ప్రవీణ్ కుమార్

 

మహబూబ్ నగర్ జిల్లాలో 500 కోట్ల ప్రభుత్వ భూమిని కబ్జా చేసేందుకు ల్యాండ్ మాఫియా ప్రయత్నాలను ప్రారంభించిందని సామాజిక కార్యకర్త, నేనుసైతం స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు దిడ్డి ప్రవీణ్ కుమార్ ఆరోపించారు.
మహబూబ్ నగర్ పట్టణం రూరల్ పోలీస్ స్టేషన్ ఎదురుగా 25 ఎకరాల ప్రభుత్వ భూమి, కాందిశికుల భూమిని మరోసారి కబ్జా చేసేందుకు ల్యాండ్ మాఫియా ప్రయత్నిస్తుందని జిల్లా కలెక్టర్ రవి నాయక్ కు సోమవారం ప్రవీణ్ ఫిర్యాదు చేశారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2016లో ఈ అక్రమ దందాకు తెరలేపిన ల్యాండ్ మాఫియా, అప్పట్లో తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించి సదరు భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నించిందని ఆయన అన్నారు. ఈ ల్యాండ్ మాఫియా కబ్జాలపై 2017లో తాను అప్పటి జిల్లా కలెక్టర్ రోనాల్డ్ రోస్, రాష్ట్ర రెవెన్యూ శాఖ అధికారులతో పాటు దేశ ప్రధాని నరేంద్ర మోడీకి పిర్యాదు చేసినట్లు ప్రవీణ్ తెలిపారు.

ఈ నేపథ్యంలోనీ ప్రధానమంత్రి కార్యాలయం పద్మ అనే డిప్యూటీ సెక్రటరీని ఈ విషయంపై పూర్తి విచారణ జరపాలిసిందిగా ఆదేశించినట్లు ఆయన తెలిపారు. దీంతో వెంటనే స్పందించిన అప్పటి జిల్లా కలెక్టర్ రోనాల్డ్ రోస్ ఈ విషయంపై పూర్తిస్థాయిలో విచారణ జరిపి, ఈ యొక్క భూమి ప్రభుత్వ భూమి అని, ఏవ్వక్యూ ప్రాపర్టీ అని, నిర్ధారణకు వచ్చారని ఆయన తెలిపారు. అంతేకాకుండా ఈ యొక్క ప్రభుత్వ భూమి కబ్జా గురైందని ప్రిన్సిపల్ సెక్రెటరీ, రెవిన్యూ శాఖకు, డిటిసిపికి, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కు కలెక్టర్ రోనాల్డ్ రోస్ నివేదిక పంపినట్లు ఆయన తెలిపారు. అంతేకాకుండా ఈ నివేదికలో మున్సిపల్ అధికారులు పాత్ర స్పష్టంగా ఉందని మున్సిపల్ అధికారులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాల్సిందిగా కలెక్టర్ సిఫార్సు చేసినట్లు ప్రవీణ్ తెలిపారు.

ఇదిలా ఉంటే 2016 నుండి 2018 వరకు ఆగిన సదరు ల్యాండ్ మాఫియా 2021లో మళ్లీ అడ్డదారిన ఆ భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నించిందని ఆరోపించారు. టీఎస్ బైపాస్ పేరిట దొడ్డి దారిన తప్పుడు ధృవీకరణ పత్రాలు సృష్టించి, తిరిగి ఆ భూమిని కబ్జా చేసేందుకు 2021 డిసెంబర్ మాసంలో మున్సిపల్ లేఔట్ ని పొందినట్లు ఆయన తెలిపారు.

గతంలో కలెక్టర్ రోనాల్డ్ రోస్ ఈ భూమి ప్రభుత్వ భూమిని కాందిసీకుల భూమి అని నివేదిక సమర్పిస్తే, ఇటీవల వచ్చిన మరో కలెక్టర్ ఇదే భూమికి లేఔట్ పర్మిషన్ ఇస్తూ ల్యాండ్ మాఫియా కు ప్రత్యక్షంగా, పరోక్షంగా సహకరించారని ఈ సందర్భంగా ప్రవీణ్ ఆరోపించారు. తొమ్మిదేళ్ల తర్వాత ల్యాండ్ మాఫియా దొడ్డిదారిన మళ్లీ లేఔట్ పర్మిషన్ పొందడంపై ప్రవీణ్ ఆందోళన వ్యక్తం చేశరు.

ఈ నేపథ్యంలోనే సోమవారం మహబూబ్నగర్ జిల్లా కలెక్టర్ రవి నాయక్ కలిసి ఈ ల్యాండ్ మాఫియా కు సంబంధించి ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన కలెక్టర్ రవి నాయక్ ఈ విషయంపై పూర్తిస్థాయిలో విచారణ జరుపుతానని, అక్రమమని తెలితే లేఔట్ ను రద్దు చేస్తానని హామీ ఇచ్చినట్లు ప్రవీణ్ తెలిపారు. ఈ అక్రమ లేఔట్ ను రద్దుచేనుపక్షంలో న్యాయ పోరాటాన్ని చేస్తానని, అవసరమైతే హైకోర్టులో ఈ విషయమై ప్రజా ప్రయోజన వాజ్యం పిల్ దాఖలు చేస్తానని ఆయన తెలిపారు. అంతేకాకుండా ఈ కబ్జాపై రెవిన్యూ శాఖ అధికారులతో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ల్యాండ్ మాఫియా పై కూడా స్వయంగా వెళ్లి ఫిర్యాదు చేస్తానని ప్రవీణ్ పేర్కొన్నారు. కాందిసీకుల భూమిని కబ్జాకోరాల నుంచి విడిపించడంతోపాటు, ప్రభుత్వ భూమిని కాపాడేందుకు న్యాయ పోరటం కొనసాగిస్తానని ఈ సందర్భంగా దిడ్డి ప్రవీణ్ కుమార్ తెలిపారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :