- తహశీల్దార్ మోకాలడ్డు
- దేవాదాయశాఖ అధికారులకు సహకరించని వైనం పై విమర్శలు
అనకాపల్లి జిల్లా, దేవరాపల్లి, ది రిపోర్టర్ న్యూస్ : దేవరాపల్లి మండలంలోని మారేపల్లి రెవెన్యూ లో సర్వే 115 లో కోట్లాదిరూపాయలు విలువ చేసె 23,15 సేంట్లు ఆక్రమిత దేవుని మాన్యం భూమికి బోర్డులు ఎర్పాటు చేయాడానికి తహశీల్దార్ సహకరించడం లెదన్న విమర్శలు గట్టిగా వినిపిస్తున్నాయి. రాష్ట్ర కమీషనరెట్ నుండి వచ్చిన అదేశాలు మేరకు అనకాపల్లి జిల్లా అసిస్టెంట్ కమీషనర్ సింగిల్ ట్రస్టు ఆఫీసర్ ను నియమించి వెంటనే అక్రమిత భూములకు బోర్డులు ఎర్పాటు చేయాలని అదేశాలు ఇచ్చారు. దింతో 17వ తేదీన బోర్డులు ఎర్పటు కు రెవెన్యూ అదికారులు పోలీసులు సహకారం కోరుతూ ఇండోమెంటు ఇన్స్పెక్టర్ ఈ నెల 14వ తేదీన తహశీల్దార్ కు దరఖాస్తు పెట్టారు 17వ తేదీన రెవెన్యూ అధికారులు గైర్హాజరు కావడంతో సోమవారం రైవాడలో జరుగుతున్న జగనన్న సురక్షలో ఉన్న తహశీల్దార్ కు ఎండోమెంట్ ఇన్స్పెక్టర్ మరో ధరఖాస్తూ పెట్టి 19వ తేదీ నాటికైనా క్రింది స్తాయి సిబ్బందిని పంపించాలని కోరారు. తహశీల్దార్ మాత్రం ‘మాకు ఖాళీ ఉన్నప్పుడు వస్తాం, మీరు వెళ్ళండి అని ఒక సారి, మీభూమికి మేమెందుకని, అసలు మేముందుకు రావాలని చేప్పి ఎండోమెంట్ ఇన్స్పెక్టర్ ర్ ని ముప్పు తీప్పలు పెట్టి పంపేశారు. రెవెన్యూ అక్రమిత భూములకు బోర్డులు పెట్టడానికి తహశీల్దార్ కు ఎమిటి అభ్యంతరం అన్నవిషయం ప్రజలకు అంతుపట్టడం లేదు. తనకు సంభందం లేని విషయాల్లో తలదూర్చి ఇరుక్కుంటున్నారని విమర్శలు ఇప్పటికే ఉన్నాయి. ఇదిలాఉండగా రియల్ ఎస్టేట్ వ్యాపారికి తహశీల్దార్ కోమ్ముకాస్తున్నారని అనకాపల్లి అసిస్టెంట్ కమీషనర్ జిల్లా కలెక్టర్ కు లెటర్ వ్రాస్తే తహశీల్దార్ వివాదాల్లో చిక్కుకోవడం ఖాయం. నిజానికి ఈ భూములకు సంబంధించి సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు డి.వెంకన్న గత రెండు సంవత్సరాలుగా దేవాదాయశాఖ అధికారుల చుట్టు కాళ్ళు అరిగేటట్టు తిరిగారు. ఎట్టకేలకు దీనిపై స్పందించిన దేవదాయశాఖ అధికారులు ఆక్రమిత భూములు స్వాధీనానికి సిద్ధపడితే రెవెన్యూ అధికారులు సహకరించడం లేదు. రెవెన్యూ అధికారులు రియల్ ఎస్టేట్ వ్యాపారికి కొమ్ముకాస్తు బోర్డులు పెట్టడానికి మోకాళ్ళు అడ్డు పెడుతున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఈ భూములకు సంబంధించి దేవాదాయశాఖ అధికారులు పాస్ పుస్తకాలు కావాలని, 22ఎ 1సిలో చేర్చాలని రెవెన్యూ అధికారులను కోరారు. దానికి రెవెన్యూ అధికారులు స్పందించలేదు. గతంలో ఉన్న తహశీల్దార్ మూడుసార్లు రియల్ ఎస్టేట్ వ్యాపారికి పాస్ బుక్కులు తిరస్కరించడం జరిగింది. ప్రస్తుత తహశీల్దార్ కబ్జాదారులకు కొమ్ముకాయాలనుకోవడం విచారకరమని,వెంటనే దేవాదాయశాఖ అధికారులకు సహకరించి బోర్డులు ఏర్పాటు చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు డి వెంకన్న డిమాండ్ చేశారు.