కడప జిల్లా : దినదినాభివృద్ధి చెందుతున్న కడప జిల్లాలోని బ్రహ్మంగారిమఠం మండలం కేంద్రంలో కోట్లాది రూపాయలు విలువచేసే రోడ్డు భవనాల శాఖకు చెందిన ప్రభుత్వ స్థలాన్ని కాజేసేందుకు కొందరు వ్యక్తుల ప్రయత్నాలకు రెవెన్యూ అధికారుల సహాయ సహకారాలు పుష్కలంగా ఉన్నాయని స్థానికుల ఆరోపణ. సోమిరెడ్డి పల్లె గ్రామ సచివాలయం ఒకటి పరిధిలో 444/1B లో 0.61 సెంట్లు స్థలాన్ని సమితులు ఉన్న కాలంలో ప్రెసిడెంట్ ఆఫ్ కడప అనే పేరు మీదకు మార్చినట్లు గా రెవెన్యూ కార్యాలయంలో ఉన్న రికార్డుల ప్రకారం స్పష్టంగా కనిపిస్తోంది ఆ స్థలాన్ని సర్వే చేసి ఆర్ అండ్ బి స్థలంగా చూపించబడినది కానీ ప్రస్తుతం రెవెన్యూ అధికారులు తప్పుడు నివేదిక తయారు చేసేందుకు ప్రస్తుతం ఎమ్మార్వో కొలత వేయుటకు వచ్చి ఆర్ అండ్ బి వారికి సంబంధించినటువంటి ఎలాంటి రికార్డు మా దగ్గర లేవు అని చెప్పడం జరిగినది గత సంవత్సర కాలంలో తాసిల్దారుగా పనిచేసిన అధికారులు సర్వే చేసి ఇది పూర్తిస్థలము ఆర్ అండ్ బి వారిదని ఎమ్మార్వో , సర్వేయర్ కొలతలు వేసి ఫీల్డ్ మ్యాప్ ను సర్టిఫై చేసి ఆర్ అండ్ బి వారికి ఇవ్వడం జరిగినది