తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం రామచంద్రపురం మండలం గడ్డ కింద పల్లి హరిజనవాడ లో సర్వే నెంబర్ 134/3 లో గల పుల్ల గుంటను అధికారుల ఆండతో చంద్రశేఖర్ రెడ్డి అనే వ్యక్తి కబ్జాకి పాల్పడుతుండగా అడ్డుకున్న గ్రామస్తులు. ఈ సందర్భంగా గ్రామస్తులు మోహన్ మాట్లాడుతూ సర్వే నెంబర్ 134/3 పుల్ల గుంటలో దళితులైన మేము మా పూర్వీకుల నుండి స్మశాన వాటికగా వినియోగించుకునే వారమని మరియు ఆవులు మేకలు గేదెలు ఆ గుంటలో నీరు తాగేవని అలాంటి గుంటను అధికారుల అండతో కబ్జాకి పాల్పడుతున్నారని, సర్వే నెంబర్ 134 ను 6 సబ్ డివిజన్లుగా 134/8లో 0.75 విస్తీర్ణంతో గడ్డ కింద పల్లి AAW గ్రామస్తులకు స్మశాన వాటికగా కేటాయించి అధికారులు ఇవ్వడం జరిగిందని, మా దళితులకు కేటాయించిన స్మశాన వాటిక భూమినే కాక కుంట భూములను కూడా జెసిపి సహాయంతో పూడ్చివేస్తున్నారని గతంలో ఈ గుంట భూమిలో ప్రభుత్వం వారు N.R.E.G.A పూడిక పనులు కట్ట పనులు కూడా చేయించారని తెలిపారు. అనంతరం బుజ్జమ్మ మాట్లాడుతూ మా తాత ముత్తాతల కాలం నుండి ఇక్కడ మా దళితులకు స్మశానం ఉండేదని అలాగే ఆవులు మేకలు గేదెలు అడవిలో మీద కెళ్ళి ఇక్కడ నీరు తాగేవని అలాంటి గుంటను చంద్రశేఖర్ రెడ్డి అనే వ్యక్తి అధికారుల అండతో జెసిబి సహాయంతో పూర్తి వేస్తున్నాడని అలాగే కుంటు నుండి నీరు వెళ్లే కల్వర్టును ఒకవైపు చంద్రశేఖర్ రెడ్డి ఆక్రమించుకుంటూ కూర్చో వేస్తున్నారని ఆయన అధికారులు స్పందించి మాకు న్యాయం చేయకూర్చాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మోహన్, బుజ్జమ్మ, సుమతి, రాణమ్మ, విజయలక్ష్మి, వెంకటేష్, కృష్ణమ్మ, భువనేశ్వరి, కమలమ్మ, రాహుల్ తదితరులు పాల్గొన్నారు.