మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో స్వచ్ఛంద సంస్థ ముసుగులో ఆక్రమ నిర్మాణం పై బుధవారం సోషల్ మీడియాలో ఫోటోలు, వీడియోలు చక్కర్లు కొడుతున్నాయి. వివరాల్లోకి వెళితే పట్టణంలోని కాంటా చౌరస్తా ఏరియాలో ప్రధాన రోడ్డుకు సమీపంలో స్వచ్ఛంద సంస్థ పేరుతో ఈ అక్రమ కట్టడం జరుగుతున్న మున్సిపల్ అధికారులు పట్టించుకోవడం లేదు. మున్సిపల్ అధికారులు ముడుపులు తీసుకొని అక్రమ నిర్మాణాలకు అండగా ఉన్నారని ఆరోపణలు లేకపోలేదు. ఓ ప్రజా ప్రతినిధి దగ్గరుండి ఈ అక్రమ కట్టడాన్ని కట్టిస్తున్నట్లు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది ఈ వార్తా. ఇకనైనా అధికారులు స్పందించి అక్రమ నిర్మాణము పై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.