contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

జగనన్న.. రీ సర్వే లో ఆదివాసీలకు అన్యాయం .. !

  • రీ సర్వేలో – పివిటీజి తెగ డి పట్టాలను – రికార్డ్ లో  తారు మారు
  • అల్లూరి సీతారామరాజు విగ్రహం వద్ద ధర్నా
  • క్షేత్ర స్థాయిలో జాయింట్ కలెక్టర్ స్వయంగా పరిశీలన చేయాలి

 

అనకాపల్లి జిల్లా, రావికమతం,ది రిపోర్టర్ టీవీ : అనకాపల్లి జిల్లా, రావికమతం మండలం కొట్లాబెల్లి రెవిన్యూ పరిధిలో సర్వే నెంబర్ 72-7, 72-12,72-11పి,72-11పి,142-5,92-2.3 లో ఆదివాసి గిరిజనులు 49 మందికి కె.గదభ పాలెం కి చెందిన ఆదివాసీ గిరిజనులు 50 ఎకరాల్లో జీడి మామిడి తోటలు వేసుకుని జీవనం సాగిస్తూ ఉన్నారు. వీరికి1988 సంవత్సరంలో ప్రభుత్వం డి – పట్టా ఇచ్చారు. జగనన్న రీ సర్వే చేయకముందు ప్రభుత్వం వెబ్ ల్యాండ్ రికార్డులో సాగుదారులుగా, హక్కుదారులుగా నమోదు చేసుకోవడం జరిగింది. జగనన్న రి సర్వే వచ్చిన తర్వాత సర్వేయర్, వీఆర్వో, రెవిన్యూ సిబ్బంది ఫీల్డ్ సర్వే చేశారు. వారికి పట్టాలు జిరాక్స్ కాపీలు కూడా ఇచ్చామని, 9(2) నోటీసులు వచ్చినప్పుడు మా భూమి వివరాలు నోటీసులు లేవని, దీంతో మాకు నోటీసులో ప్రభుత్వం భూమి వివరాలు లేవని అడగ్గా రెండోసారి సర్వే చేస్తామని చెప్పారని, వాస్తవానికి రెండో విడత పట్టాలు ఇచ్చిన తర్వాత డిఫారం భూములకి పట్టాలు ఇవ్వలేదని దీంతో గతంలో బ్యాంకులో రుణాలు తీసుకున్నామని, ప్రస్తుతం వెబ్ ల్యాండ్ రికార్డులో ప్రభుత్వ భూమి గా వస్తుందని ఈ విషయం అధికారులు చెప్పగా తిరిగి సర్వే చేస్తామని అన్నారని, నేటికీ రెండు నెలలు పూర్తవుతున్న సర్వే పూర్తి చేయలేదని వారు వాపోయారు. అన్యాయంగా జగనన్న రి సర్వేలో మా భూముల్ని ప్రభుత్వ వెబ్ ల్యాండ్ రికార్డులో ప్రభుత్వ భూములుగా నమోదు చేశారని, వాస్తవానికి (ROR) రికార్డ్స్ ఆఫ్ రైట్ చట్ట ప్రకారంగా మాకు ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా మా భూములను ప్రభుత్వ భూములుగా నమోదు చేసినటువంటి అధికారిపై చర్య తీసుకోవాలని, జిల్లా జాయింట్ కలెక్టర్ స్వయంగా పరిశీలన చేయాలని సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు కే గోవిందరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు. నాన్ షెడ్యూల్ గిరిజన గ్రామాల్లో గిరిజన భూములను రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు భూములు కాజే చేయడానికి రెవెన్యూ అధికారులు, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు కుమ్మక్కవడం వల్ల నాన్ షెడ్యూల్ ప్రాంతాల్లో గిరిజన భూములలో జగనన్న రి సర్వేలో సాగులో ఉన్న గిరిజనులను సాగులో లేనట్టుగా రికార్డులు తయారు చేస్తున్నారని మండి పడ్డారు,ఈ విషయంపై అధికారులకు అనేక సార్లు ఫిర్యాదు చేసిన ఎటువంటి చర్యలు తీసుకోలేదు తక్షణమే సర్వే చేసి సాగులో ఉన్న గిరిజనులు వెబ్ ల్యాండ్ రికార్డులో సాగుదారులుగా నమోదు చేసి పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వాలని ఈ మధ్యకాలంలో రెండు విడతలకే అసైన్మెంట్ తయారుచేసిందని రికార్డుల్లో సాగుదారులుగా ఎక్కడా కూడా నమోదు చేయలేదని తక్షణమే గిరిజనులకు అసైన్మెంట్ చేసి పట్టాలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నామన్నారు.  ఈ కార్యక్రమంలో బొడ్డ అచ్చన్న, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :