శ్రీలంకలో ఆహార, ఆర్థిక సంక్షోభం తీవ్రస్థాయికి చేరింది. గత కొన్నిరోజులుగా కళ్లెం తెంచుకున్న నిత్యావసరాల ధరలు తాజాగా అమాంతం పెరిగిపోయాయి. ప్రస్తుతం శ్రీలంకలో ఒక కోడిగుడ్డు రూ.35 కాగా, కిలో చికెన్ ధర రూ.1000 పలుకుతోంది. కిలో ఉల్లిగడ్డలు రూ.200 కాగా, పాలపొడి రూ.1,945కి చేరింది. లీటర్ పెట్రోల్ రూ.283, లీటర్ డీజిల్ రూ.220గా ఉంది. అటు, డాలర్ తో శ్రీలంక కరెన్సీ విలువ రూ.270కి చేరింది.