- రాష్ట్ర ప్రభుత్వం గిరిజనుల పట్ల చిన్న సూపు ఎందుకు.
విజయనగరం జిల్లా,ఈ రోజు విజయనగరం జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ఆదివాసీ ప్రజలు పెద్ద ఎత్తున నీరసన చేయడం జరిగింది. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ….జిల్లాల విభజన వలన విజయనగరం ఆదివాసీలకు పెద్ద ఎత్తున నష్టం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. పోడు పట్టాలు. సర్వేలు అయ్యి స్కెచ్ లు వచ్చి.. ఎక్కడిక్కడ నిలిచిపోయాయి..అధికారులు పట్టించుకునే పరిస్థితి లేదని వాపోయారు. ఏళ్ల తరబడి ప్రభుత్వ భూమిని సాగు చేస్తున్న గిరిజనులకు ఒక్క గ్రామంలో కూడా కనీసం ఒక్క పట్టా కూడా ఇవ్వలేవని, అలాగే జిల్లాలో నేటికీ రోడ్లు కరెంట్. మంచినీరు లాంటి మౌలిక సదుపాయాలు లేని గ్రామాలు దర్శనమి స్తున్నాయని, జిల్లాలో ఐ టి డి ఏ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు అలాగే బోయ వాల్మీకులను, మరియు ఇతర ఏ కులాలను గిరిజన జాబితాలో చేర్చకూడదని కొన్ని ప్రధాన డిమాండ్లు జిల్లా కలెక్టర్ కు తెలియజేయడం జరిగిందన్నారు.