మచిలీపట్నం మంగళవారం దళిత సంఘాల నాయకులు ఇనుకుదురు పోలీస్ స్టేషన్ ఎదురు ఉన్న మెయిన్ రోడ్డుమీద బైటాయించారు. స్వర్గీయ రంగా జయంతి సందర్భంగా శివగంగ సెంటర్ లో రంగా విగ్రహానికి పూలమాలలతో ఘనంగా నివాళులర్పించిన అనంతరం డీజే లతో ర్యాలీ నిర్వహించారు. ఆ సందర్భంగా గుర్తు తెలియని వ్యక్తి అటుగా వెళ్తున్న ఆర్టీసీ బస్సు అద్దం పగులకొట్టి, శారద నగర్ లోని అంబేద్కర్ విగ్రహంపై కర్ర విసిరాడు. దీనితో ఆగ్రహం చెందిన దళిత సంఘం నాయకులు నిరసనగా ఇనుకుదురు పోలీస్ స్టేషన్ ముందు రోడ్ పై బైఠాయించి ధర్నా నిర్వహించారు. సంఘటన పై పూర్తి విచారణ జరిపి నిందితులను శిక్షించాలని దళిత సంఘం నాయకులు డిమాండ్ చేశారు. నిందితులను చట్టపరంగా శిక్షించేంతవరకు ధర్నా నిర్వహిస్తామని అన్నారు.పోలీసులు దళిత సంఘ నాయకుల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. బందరు డీఎస్పీ మాధవరెడ్డి దళిత సంఘం నాయకులతో చర్చలు జరిపి దోషులపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడం తో ధర్నా విరమించారు. ఈ ధర్నా కార్యక్రమంలో థామస్ నోబెల్, ఉచ్చుల గణేష్, ఏలేటి రాజేశ్వరరావు, సౌదాడ బాలాజీ, శ్రీహరి బాబు , జక్కుల ఆనంద్ బాబు తదితరులు పాల్గొన్నారు.
అంబేద్కర్ విగ్రహం పై రాళ్ళు,కర్రలు విసిరి అవమానించడంపై డిఎస్పి మాధవరెడ్డి వివరణ ఇచ్చారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దళిత సంఘం నాయకులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టి దోషులను శిక్షిస్తామని అన్నారు