పల్నాడు జిల్లా కారంపూడి పట్టణంలోని సాయి కృష్ణ జూనియర్ కాలేజ్ టీ స్టాల్ ఎదురుగా గల ఆర్ అండ్ బి రోడ్డు గుంతలమయమై వాహనదారులను ఇబ్బందులకు గురిచేస్తుంది. కొన్నేళ్లుగా వాహనదారులు ఇబ్బందులు పడుతూనే ఉన్నారు కానీ అధికారులు మాత్రం పట్టించుకోలేదు. నాయకులు, అధికారులు అదే దారిలో వెళుతూ వస్తుంటారు కానీ పట్టించుకోలేదు. ది రిపోర్టర్ టివి రిపోర్టర్ కె. నాగార్జున తన సొంత ఖర్చులతో ఆ గుంతలను పూడ్చారు. ఇలాగే ఇంకొంతమంది యువత ముందుకొచ్చి స్వచ్చందంగా ఇలాంటి కార్యక్రమాలు చేస్తేనైనా అధికారులకు సిగ్గొస్తుంది. ఇకనైనా కళ్ళున్నా చూడలేని నాయకులు , అధికారులు కళ్ళు తెరిచి ప్రజా సమస్యలను గుర్తించి రోడ్డు మరమత్తులు వెంటనే చేయాలనీ స్థానికులు కోరుతున్నారు.