నిజామాబాద్ జిల్లా:ఆర్మూరు టౌన్ – మామిడిపల్లి ఆదర్శనగర్ లో 137వ మే డే పోస్టల్ ఆవిష్కరణ సందర్భంగా గ్రామపంచాయతీ కార్మికుల హక్కులను పోరాడి సాధిద్దామని తెలంగాణ ప్రగతిశీల గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ (ఐఎఫ్టియు) రాష్ట్ర అధ్యక్షులు దాసు మాట్లాడుతూ,137వ మే డే ను గ్రామ గ్రామాలలో ఘనంగా నిర్వహించాలని, ఆయన కోరారు. నరేంద్ర మోడీ నాలుగు లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా, సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని డిమాండ్తో మేడే సభలను జరపాలని ఆయన తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో గ్రామపంచాయతీ కార్మికుల క్రమబద్ధీకరణ కోసం జెఎసి ఆధ్వర్యంలో ఆందోళనకు శ్రీకారం చుట్టామని, జిపి కార్మికులు & ఉద్యోగులు పెద్ద ఎత్తున కదలాలని వారు కొనియాడారు, పోరాడితే పోయేదేమీ లేదు మన బానిస సంకెళ్లు తప్ప అనే నినాదాన్ని మదిలో నింపుకొని, మన కార్మికుల బతుకులు వెలుగు నింపడానికి చికాకు అమరవీరుల స్ఫూర్తితో ఉద్యమించాలని ఆయన పిలుపునిచ్చారు. గ్రామపంచాయతీ కార్మికుల సమావేశం అనంతరం మేడే పోస్టర్లను మామిడిపల్లిలోని ఆదర్శనగర్ లో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ రాష్ట్ర కార్యదర్శి జఠంకి వెంకన్న, జిల్లా ప్రధాన కార్యదర్శి జేపీ గంగాధర్, భానుచందర్, శ్రీనివాస్, గంగాధర్, నవీన్, నాగమణి, మోహన్, లక్ష్మణ్, సంసన్, రాజన్న తదితరులు పాల్గొన్నారు.
