contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

గిరిజన సంఘం మహాసభలను విజయవంతం చెద్దాం…

  • ఆదివాసుల సాంప్రదాయ సాంస్కృతిక కళలను కాపాడు కొందం
  • ఐక్య ఉద్యమానికి తరలిరండి APGS పిలుపు

హుకుంపేట,గిరిజన సంఘం 8వ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలనీ, ఈ నెల 1,2 తేదీలలో ఎక్కడి కక్కడ గిరిజన సంఘం జెండా ఆవిష్కరణలు చేపట్టాలని కేంద్ర కమిటీ పిలుపులో భాగంగా ఈరోజు హుకుంపేట మండలం గిరిజన సంఘం కార్యాలయంలో సంఘ జిల్లా అధ్యక్షులు టి. క్రిష్ణ రావు అద్వీఆర్యంలో జెండా ఆవిష్కరణ చేపట్టారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇ నెల 6,7,8,9 తారికుల్లో నాలుగు రోజులపాటు అరకువెలిలో జరుగు గిరిజన సంఘం 8వ రాష్ట్ర మహాసభలను ఆదివాసులు పెద్దసంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు.
అంతరించి పోతున్న గిరిజన ఆచార, సాంప్రదాయ సంస్కృతులను కాపాడుకోవడం,ఆదివాసుల కలలను రేపటి ఆదివాసీ సమాజానికి వారసత్వంగా అందించడానికి మహాసభలో భాగంగా 6,7 తేదీలలో నిర్వహించే ఆట, మాట,పాట కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుండి పెద్ద ఎత్తున కళాబ్రుందలు పాల్గొని సాంస్కృతిక సంబరాలను విజయవంతం చేసి ఆదివాసీ రాయితీలు, రిజర్వేశండ్ల మూలాలను పరిరక్షించుకోవాలన్నారు.  కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ఆదివాసుల హక్కులు,చట్టాలు నిర్వీర్యం చేసి,గిరిజన జాతి మనుగడును అంతం చేయడానికి పునుకొంటున్న చర్యలను తిప్పి కొట్టడానికి ఈ మహాసభ దహోదపడగలదని వారు ఆశాభావం వ్యక్తంచేశారు.నూతన అటవి పాలసీ విధానాన్ని అడ్డుకొందాం,1/70 భుబదలాయింపు చట్టం సంపూర్ణంగా అమలుకై,గిరిజనేతర కులాల్ని గిరిజన జాబితాలో చేర్చడాన్ని వ్యతిరేకిస్తు,జి ఓ నెంబార్ 3 చట్టబద్దత కల్పించడానికి ఆదివాసుల ఐక్య ఉద్యమ కార్యాచరణ సిద్దం చేసుకోవడానికి ఈ మహాసభ ప్రధాన ఉద్దేశమై ఉందన్నారు.కావున పార్టీలకు,కులాలకు,ప్రాంతాలకు అతీతంగా అన్ని వర్గాలవారు పాల్గొని ఆదివాసుల ఐక్య ఉద్యమాలకు శ్రీకారం చుట్టాలని వారు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమానికి సంగ నాయకులు అప్పలకొండ పడాల్ , లక్ష్మణరావు వివిధ గ్రామాలకు చెందిన గురిజన యువకులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :