పార్వతీపురం మన్యం జిల్లా: పార్వతీపురం స్థానిక ఎల్ఐసి కార్యాలయం వద్ద ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ పిలుపుమేరకు ఎల్ఐసి ఉద్యోగులు ఒక గంట సమ్మె చేపట్టారు. పార్వతీపురం బేస్ యూనిట్ ప్రెసిడెంట్ ఆర్ వి ప్రసాద్, సెక్రటరీ టెక్కలి ధర్మారావు మాట్లాడుతూ తక్షణమే క్లాస్ 3 & 4 ఉద్యోగుల నియామకం చేపట్టాలని, AIIEA కు గుర్తింపు ఇవ్వాలని డిమాండ్ చేశారు. మేనేజ్మెంట్ తక్షణమే రిక్రూట్మెంట్ చేపట్టిన యెడల విశాఖ డివిజన్ ఐసీఈయు ఇచ్చిన పిలుపుమేరకు ఎటువంటి పోరాటాలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు.
