మంచిర్యాల జిల్లాలోనీ బెల్లంపల్లి నియోజకవర్గం లో మంత్రీ ఇంద్రకరణ్ రెడ్డి పర్యటించారు, బెల్లంపల్లి ప్రభుత్వ 100 పడకల ఆసుపత్రిలో మంచిర్యాల జిల్లా ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన CPR ( కార్డియోపల్మనరీ రిసస్కీటేషన్ ) & AED హృదయశ్వాసకోశ పునరుజ్జీవనం ( లైఫ్ సేవింగ్ టెక్నిక్ శిక్షణ ) అవగాహన కార్యక్రమo లో మంత్రీ ముఖ్యఅతిథిలుగా పాల్గోన్నారు, ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇటీవల కాలంలో ఆకస్మిక గుండెపోటు వలన అనేక మంది వారి విలువైన ప్రాణాలు కోల్పోయారని, ఈ CPR & AED వలన వారిని ఆకస్మిక గుండెపోటు నుండి కాపాడే ప్రయత్నం చేయవచ్చని, కావున ప్రతి ఒక్కరూ తప్పకుండా ఈ CPR & AED మెలకువలు తెలుసుకోవాలని సూచించారు. కన్నెపల్లి మండలం ఎల్లారం గ్రామంలో రూ.1.50 కోట్లతో చర్లపల్లి ఆర్ అండ్ బీ నిధులతో చేప్పట్టిన బీటీ రోడ్ నిర్మాణానికి భూమిపూజ. నెన్నల్ మండలంలో తునికాకు సేకరణ దారులకు బోనస్ చెక్కులను అందచేసిన మంత్రి రాష్ట్ర వ్యాప్తంగా 2016 నుంచి 2021 వరకు రూ.200 కోట్లను బోనస్(నెట్ రెవెన్యూ)చెల్లిస్తున్నామని చెప్పారు. బెల్లంపల్లి నియోజవర్గంలో రూ 10.45 కోట్ల ను లబ్దిదారులకుచెల్లిస్తున్నామని.నేరుగా వారి ఖాతాల్లోనే నగదు జమ అవుతుందని వెల్లడించారు.మరోవైపు బీడీ ఆకుల సేకరణ రేట్ కట్టకు రూ.2.05 పైసల నుంచి రూ.3 లకు పెంచమని ఈ సీజన్ నుంచి ఈ రేట్లు వర్తింపజేస్తామని పేర్కొన్నారు. గొల్లపల్లి గ్రామంలో మనఊరు మనబడి కార్యక్రమం రూ.16.45 వేల తో ప్రాంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, జడ్పి చైర్ పర్సన్ నల్లల భాగ్య లక్ష్మీ, జిల్లా గ్రంధాలయ చైర్మన్ రేణికుంట్ల ప్రవీణ్, రాష్ట్ర అటవీశాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.