అల్లూరి జిల్లా హుకుంపేట:మండలంలో తీగలవలస పంచాయతీ నిమ్మలగొంది గ్రామంలో రహదారి సౌకర్యం లేక గ్రామ ప్రజలు ఇక్కట్లు పడుతున్నారు.కల్వర్టు ఏర్పాటు చేస్తేనే రహదారి నిర్మాణంనికి మోక్షం కలుగుతుంది.స్వతంత్ర వచ్చి 76 ఏళ్ళు పైబడిన నేటి ఏజెన్సీ ప్రాంతంలో అబివృద్ది నోచుకోలేదు. ఇప్పటికి రహదారి నిర్మాణం లేని నిమ్మలగొంది గ్రామ అనేకం కోకొల్లలుగా ఏజెన్సీ ప్రాంతంలో దర్శనం ఇస్తున్నయీ గిరిజన ప్రాంతాల్లో ఉన్న ఆదివాసులకు గిరిజనుల కోసం అబివృద్ది ప్రత్యేకంగా చేయాలని ప్రభుత్వం ఐటిడిఎ ఏర్పాటు చేశారు.కానీ రెండు మూడు ఏళ్ళుకు ఒక్కసారిగా ఐటీడీఏ పిఓ లను బదిలీలు చేయడమే సరిపోతుంది.పిఓ బాధ్యతలు చేపట్టి అన్ని శాఖ అధికారులు పరిచయలు సమస్యలు తెలుసుకున్నే సరికే ప్రభుత్వలు మారిపోతున్నాయి.. ఏజెన్సీ ప్రాంతంలో ఎప్పుడు త్రాగునీరు రహదారి వంటి సమస్యలు తిరుతాయీ.దీంతో సమస్య పరిష్కారానికి నోచుకోలేక ఉండిపోతు న్నాయి. నిమ్మలగొంది గ్రామంలోని గతంలో 2016 సంవత్సరం క్రితం
కల్వర్టు ఏర్పాటు చేశారు. నాణ్యత లేకపోవడంతో ఏడాది కాకుండా నే అత్యధిక వర్షాలు కురువడంతో మొత్తం కల్వర్టు కుప్పకూలిపోయీందీ. ఇప్పుడు కనీసం కాలిబాటన నడిచి వెళ్లెందుకు కుడా విలులేని పరిస్థితి ఏర్పడింది.నిర్మించి కల్వర్టు ఐదు ముక్కలుగా అయిపోయి అద్వాన్నంగా ఉంది అప్పట్లో
కల్వర్టు బిల్లు కూడా అయిపోయింది. చర్పంచ్ ఎంపీటీసీలు ఎవరు పాటింపు చేయకపోవడంతో సమస్య సమస్య గానే పరిష్కరనికి నొచ్చుకొకుండ ఉండిపోయింది. అధికారులు పర్యవేక్షణ లేక గుుత్తెదారులు తమకు నచ్చినట్లు తక్కువ క్యోలిటితో నిర్మాణం చేస్తున్నారు. మారుమూల ప్రాంతాల్లో ఏ అధికారులు రాలేరు అని ధీమాతో కాంట్రాక్టర్లు పనులు చేస్తున్నారు.కల్వర్టు పడైపోవడం వల్లే గ్రామంలో నేటి వరకు రహదారి మంజూరు చేయలేదు. నిమ్మలగొంది గ్రామంలో (పివిటిజి)కి చెందిన గిరిజనులు జీవనం సాగిస్తున్నారు.25 కుటుంబలు 450 మంది జనాభా కలిగి నివసిస్తున్నారు.తీగలవలస పంచాయతీ నుంచి 2.50, కిలోమీటర్ల దూరం ఉంది. ఎంపీపీ దత్తత గ్రామంలో సమస్యల నిలయంగా మరింది.గ్రామ సమస్య ల పై పలుమారులు ఆడితే నిధుల లేదు అంటు పొంతనలేని సమాధానాలు