కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు. అమరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా నివాళులు అర్పించడం జరిగినది,ఈ కార్యక్రమంలో ఎంపీపీ లింగాల మల్లారెడ్డి మాట్లాడుతూ రాజ్యంగ బద్దమైన సమానత్వ విలువ కోసం జరిగిన మహత్తర పోరాటం తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం. ఈ పోరాటంలో అమరులైన అమరుల త్యాగఫలమే తెలంగాణ రాష్ట్రం.అనన్య సామాన్యమైన వారి త్యాగాలను సగౌరవంగా స్మరించుకుంటు నివాళులు అర్పించాడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ స్వాతి,ఎంపీఓ పివి నర్సింహారెడ్డి, ఎంపీటీసీ గుడెల్లి ఆంజనేయులు,అటికం రాజేశం, నాయకులు ఏలేటి చంద్రారెడ్డి, న్యాత సుధాకర్, బొడ్డు సునీల్, కార్యాలయ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.