కరీంనగర్ జిల్లా: లయన్స్ క్లబ్ ఆఫ్ గన్నేరువరం ఆధ్వర్యంలో సోమవారం మండలకేంద్రం గన్నేరువరం లో వారసంత నందు రెకుర్తి కంటి ఆసుపత్రి వారి సహకారంతో టెక్నీషియన్ ప్రభాకర్ చే ఉచిత కంటి పరీక్షలు నిర్వహించి, ఆపరేషన్ అవసరమైన 50 మందిని బస్సు సౌకర్యంతో రేకుర్తి కంటి ఆసుపత్రికి తీసుకెళ్లడం జరిగింది, పరీక్షలు చేసిన అనంతరం వారికి ఆపరేషన్ చేసి మళ్ళీ సురక్షితంగా వారిని ఉచిత బస్సులో ఇంటికి పంపడం జరుగుతుంది, ఈ కార్యక్రమంలో జోన్ చైర్మన్ బొడ్డు సునీల్, అధ్యక్షులు కొండాల్ రెడ్డి,గంప వెంకన్న, బూర శ్రీనివాస్, బూర రామకృష్ణ, ప్రభాకర్, వెంకటేశ్వర్, కిషన్ రెడ్డి, గొల్లపల్లి రవి, తేల రవి, గూడూరు సంతోష్ రెడ్డి లు పాల్గొన్నారు.
