కరీంనగర్ జిల్లా లయన్స్ క్లబ్ 320G కి సంబంధించిన నారాయణద్రి రీజియన్ చైర్మన్ ఇనుగుర్తి రమేష్ ఏర్పాటుచేసిన మీటింగ్ లో భాగంగా లయన్స్ క్లబ్ ఆఫ్ గన్నేరువరం ప్రదర్శించిన బ్యానర్ ప్రజెంటేషన్ కు విన్నర్ అవార్డు , మరియు క్లబ్ ప్రెసిడెంట్ బొడ్డు సునీల్ కి 2 అండ్ బెస్ట్ ప్రెసిడెంట్ అవార్డు, తేల్ల భాస్కర్ కి బెస్ట్ కార్యదర్శి అవార్డు, కాంతాల అంజిరెడ్డికి బెస్ట్ కోశాధికారి అవార్డు, బూర శ్రీనివాస్ కి బెస్ట్ కోఆర్డినేటర్ అవార్డు, తో పాటు ఇతర బహుమతులు పొందటం జరిగింది. అంతే కాకుండా లైన్స్ క్లబ్ ఆఫ్ గన్నేరువరం చేస్తున్న సేవలను జిల్లా పరిధిలో ప్రశంసించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గన్నేరువరం లయన్స్ క్లబ్ సభ్యులు బూర వెంకటేశ్వర్,ముస్కు ఉపేందర్ రెడ్డి, కాంతాల అంజిరెడ్డి, బూర రామకృష్ణ, బూర శ్రీనివాస్, దేశరాజు శివ సాయి, కాంతాల కిషన్ రెడ్డి లు పాల్గొన్నారు.