పల్నాడు జిల్లా కారంపూడి లో మాచర్ల రోడ్డు లో చర్చ్ ప్రక్కన కొత్తగా బెల్ట్ షాపులు ఏర్పాటు చేసారు. చుట్టుపక్కల నివాసాలు , పక్కనే లూథరన్ చర్చి , కొద్దిగా ముందుకు వెళితే స్కూల్స్ ఉన్నాయ్. నివాసాలకు దగ్గర్లో బెల్టు షాపులు ఉండడం వలన యువత మత్తు కు బానిసలు అవుతున్నారని అంతేకాక కూల్స్ కి వెళ్ళి వచ్చే రహదారి కావడం వలన తాగిన మత్తులో యువత ఎవరి పై అఘాయిత్యాలకు పాలుపడతారోనని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. దగ్గరలో పాడుబడిన సాయి కృష్ణ జూనియర్ కాలేజీ ప్రాంగణంలో మునిగితేలుతున్నారు. కాలేజీ గ్రౌండ్ గంజాయి, మందుబాబులకు ఒక గెస్ట్ హౌస్ లో తయారు అయింది. స్థానిక అధికారులు వెంటనే స్పందించి బెల్టు షాపును తొలగించాలని, గంజాయి విక్రయాలను కనుగొని వాటికి చెక్ పెట్టాలని స్థానికులు కోరుతున్నారు