హైదరాబాద్: మెదక్ (Medak) పోలీస్‌స్టేషన్‌లో లాకప్‌డెత్ (Lockup death) ఘటనపై డీజీపీ అంజనీకుమార్ (DGP Anjani Kumar) ఆగ్రహం వ్యక్తం చేశారు..
దీనిపై సమగ్ర విచారణ జరపాలని ఐజీ చంద్రశేఖర్‌ను ఆదేశించారు. కామారెడ్డికి చెందిన సీనియర్ పోలీసు అధికారిని దర్యాప్తు అధికారిగా నియమించాలని, ఐజీ చంద్రశేఖర్ విచారణను పర్యవేక్షించాలని డీజీపీ సూచించారు. మెదక్ సీఐ, ఎస్‌ఐపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీని ఆదేశించారు.