అన్నమయ్య జిల్లా, తంబాలపల్లి :మంగళగిరి తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి,రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబుని తంబళ్లపల్లి నియోజకవర్గ టిడిపి ఇంచార్జ్ దాసరిపల్లి జయచంధ్రారెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నియోజకవర్గ సమస్యలు, టీడీపీ బోలోపేతం, ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై ఇద్దరు చర్చించారు. నియోజకవర్గంలోని ఆరు మండలాలకు నిజాయితీగల పోలీసులు, తహసిల్దార్,ఎంపీడీవో, విద్యుత్ శాఖ ఏఈ,వ్యవసాయ అధికారులను నియమించాలని నారా లోకేష్ దృష్టికి జయచంద్రా రెడ్డి తీసుకెళ్లారు. పార్టీ కోసం పనిచేసిన వారికి పదవులు కేటాయింపు, పార్టీలో ఉండి కోవర్ట్ లుగా పనిచేసిన వారిని పక్కన పెట్టేలా ఇద్దరూ చర్చించారు. ముఖ్యంగా ప్రముఖ పర్యాటక కేంద్రమైన హార్సిలీ హిల్స్, శ్రీ భ్రమరాంబ సమేత మల్లయ్య కొండ, సోంపాలెం ఆలయ అభివృద్ధి పైన మంత్రి నారా లోకేష్ దృష్టికి జయచంద్రారెడ్డి తీసుకెళ్లారు.