తనకు భద్రత తగ్గించారని, సీఎంగా ఉన్నప్పటి భద్రత కల్పించాలని వైసీపీ అధ్యక్షుడు జగన్ హైకోర్టును ఆశ్రయించడం తెలిసిందే. దీనిపై ఏపీ మంత్రి నారా లోకేశ్ స్పందించారు. జడ్ ప్లస్ భద్రత ఉన్నా గానీ జగన్ కు ఇంకా అభద్రతా భావం ఎందుకు? అని ప్రశ్నించారు.
జగన్ కు ప్రస్తుతం 58 మందితో భద్రత ఉందని లోకేశ్ వెల్లడించారు. జగన్ కు ఇప్పుడు రెండు ఎస్కార్ట్ బృందాలు, 10 మంది సాయుధ గార్డులతో భద్రత ఉందని తెలిపారు. జగన్ కాన్వాయ్ లో రెండు అత్యాధునిక ల్యాండ్ క్రూయిజర్ బుల్లెట్ ప్రూఫ్ కార్లు కూడా ఉన్నాయని లోకేశ్ వెల్లడించారు. ఇవి సరిపోవా… ఇంకా 986 మందితో భద్రత ఎందుకు? అంటూ లోకేశ్ ప్రశ్నించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.