ఎపి : ప్రతిపక్షాలు , ఎల్లో మీడియా తన వెంట్రుక కూడా పీకలేవని ముఖ్యమంత్రి జగన్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. నంద్యాలలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలకు టీడీపీ నేత నారా లోకేశ్ తాజాగా కౌంటర్ ఇచ్చారు.
ట్విట్టర్ ద్వారా నారా లోకేశ్ స్పందిస్తూ… గల్లీ నుంచి ఢిల్లీ వరకు పనికిమాలినోడని తేలిపోయిన తర్వాత ఫ్రస్ట్రేషన్ కాకపోతే ఏమొస్తుందని ఎద్దేవా చేశారు. ‘వెంట్రుక మహరాజ్, ఈకల ఎంపరర్ జగన్ గారూ… మీ వెంట్రుకలు పీకే ఓపిక, తీరిక మాకు లేవు’ అని ఎద్దేవా చేశారు.
మీ నవరంధ్ర పాలన నుంచి ప్రజలను ఎలా గట్టెక్కించాలనే ఆలోచనలతో తాము పని చేస్తున్నామని లోకేశ్ అన్నారు. ప్రజలే మీ వెంట్రుకలు పీకడానికి, గుండు కొట్టించి పిండి బొట్లు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పారు. ‘నా మాట విని మీరే గుండు కొట్టించుకోండి. మీ వెంట్రుక ఎవడు పీకుతాడో చూద్దాం’ అని అన్నారు.