మాచర్ల శాసనసభ్యులు శ్రీ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కౌంటర్ ఎటాక్.
లోకేష్ నువ్వు నిజంగా చంద్రబాబు రక్తం పంచుకుని పుట్టివుంటే నా మీద చేసిన ఆరోపణలు ఒక్కటైనా నిరూపించు
నిన్ను, నువ్వు పెట్టిన కిరాయి వ్యక్తులను చూస్తే పిన్నెల్లి బ్రదర్స్ కి తడిచిపోతుంది అన్నావు, మాచర్ల ప్రజలు 5 సార్లు గెలిపించిన పిన్నెల్లి కుటుంబాన్ని చూస్తే మీ అయ్యా కొడుకులకు ప్యాంట్లు తడిచిపోతున్నాయి
నువ్వు పెట్టిన కిరాయి పెయిడ్ ఆర్టిస్టు ఆల్రెడీ 2సార్లు మాచర్ల నియోజకవర్గం లో ఓడిపోయి పిన్నెల్లి కుటుంబ దెబ్బ రుచిచూసి ప్యాంటు తడుపుకొని గుంటూరు పారిపోయాడు
ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ చదవటం కాదు. ఒక నియోజకవర్గం మీద ఆరోపణలు చేసేటప్పుడు వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలి లోకేష్
నువ్వు ఎలాగూ వార్డ్ మెంబెర్ గా కూడా గెలవలేవు, మాచర్ల నియోజకవర్గానికిరా 31 వార్డులను ఏకగ్రీవం గా చేయించిన వాడిని నిన్ను కూడా ఒక వార్డుకి ఏకగ్రీవం గా గెలిపించి వార్డు మెంబెర్ ని చేయిస్తాను
ఒక ఆగస్ట్ కి వచ్చి మాచర్ల నియోజకవర్గాన్ని దత్తత తీసుకుంటా అంటావు, ఇంకో ఆగస్ట్ కి వచ్చి వరికిపూడిసెల కు ఫేక్ జి.వో ఇచ్చిపోతావ్, ఈ ఆగస్టు కి వచ్చి వరికిపూడిసెల కు శంఖుస్థాపన చేస్తాను అంటావు, వచ్చే ఆగస్ట్ కల్లా ఆంధ్ర ప్రజలు నిన్ను, నీ అయ్యను హైదరాబాదు పిచ్చి ఆసుపత్రిలో చేర్పించటం ఖాయం లోకేష్
ఇదే జూలకంటి బ్రహ్మాఆనందం రెడ్డిని ఇప్పుడు నియోజకవర్గంలో ప్రజలు టిడిపి పెయిడ్ ఆర్టిస్ట్, నాన్ లోకల్ బ్రహ్మాఆనందం రెడ్డి, మైనింగ్ దొంగ బినామీ అని అంటున్నారు.
జూలకంటి బ్రహ్మాఆనందం రెడ్డి యరపతినేని, చంద్రబాబు మరియు లోకేష్ దగ్గర ప్యాకేజీలు మాట్లాడుకునే వ్యక్తివి నువ్వు మా గురించి మాట్లాడటం చాలా హాస్యాస్పదంగా ఉంది.
ఇదే బ్రహ్మాఆనందం రెడ్డి అమ్మ టిడిపి ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో రాష్ట్రమే ఉలిక్కిపడే విధంగా ఏడు మర్డర్లో చేయించాడు. దాన్ని చాకుగా చూపించి గుంటూరులో భూదందాలు చేసింది నువ్వు కాదా…!
బ్రహ్మాఆనందం రెడ్డి మాచర్ల ఇంచార్జి గా వచ్చిన తర్వాత తన రాజకీయ లబ్ధి కోసం గ్రామాలలో గ్రూప్ రాజకీయాలు ప్రోత్సహిస్తున్నాడు.
నాన్ లోకల్ బ్రహ్మ రెడ్డి నియోజకవర్గంలో పర్యటించాలంటే గుంటూరు- మాచర్ల రోజువారీ షికార్లు తిరుగుతుంది నీవు కాదా..!