- పల్లెల్లో యదేచ్చగా మద్యం విక్రయాలు
- మళ్లీ మొదలైన మద్యం సిండికేట్ వ్యాపారం…!
- మద్యం షాపుల్లో కనిపించని బ్రాండెడ్ మందు
- మద్యం ప్రియుల బ్రాండ్లన్నీ బెల్ట్ షాపులోనే
- మద్యం ప్రియుల జేబులను కుల్లగోడుతున్న వైన్ షాప్ యజమానులు
- ప్రశ్నించిన మద్యం ప్రియులపై దాడులు చేస్తున్న వైన్ షాపు నిర్వాహకులు
- ఇంత జరుగుతున్న ఇటువైపు కన్నెత్తి చూడని ఎక్సేంజ్ శాఖ అధికారులు
ఖమ్మం జిల్లా, చండ్రుగొండ, అన్నపురెడ్డిపల్లి: ఏజెన్సీ మండలాల్లో మద్యం సిండికేట్ హవా యదేచ్చగా కొనసాగుతోంది. అడ్డుఅదుపూ లేకుండా ప్రజారోగ్యానికి చిల్లులు పెడుతోంది. యథేచ్ఛగా మద్యాన్ని పల్లె పల్లెకు సరఫరా చేస్తూ ప్రజల జీవనాన్ని చిన్నా భిన్నం చేస్తున్నారు. భద్రాద్రి జిల్లా లోని ఏజెన్సీ మండలాలైన చండ్రుగొండ, అన్నపురెడ్డిపల్లి, మండలాల్లో మొత్తం నాలుగు వైన్ షాపులున్నాయి. రెండు అన్నపురెడ్డిపల్లి మండలం పెద్దిరెడ్డిగూడెం గ్రామపంచాయతీలో రెండు చండ్రుగొండ మండల కేంద్రంలో ఉన్నాయి. ఈ వైన్ షాపుల యజమానులు గత పది ఏండ్లుగా ఇదే వ్యాపారంలో ఉండటంతో వీరి ఆటలు మూడు బీర్లు.. ఆరు కోటర్లు గా కొనసాగుతుంది. ఇదిలా ఉండగా నాలుగు షాపులు నిర్వహించాల్సిన మద్యం వ్యాపారులు రెండు షాపులు బెల్టుకు కేటాయించి. రెండు షాపులు కౌంటర్ కింద నడుపుతున్నారు. వైన్ షాపుల యజమానులు సిండికేట్‌గా ఏర్పడి నయా దందాకి తెరలేపారు. మద్యం షాపులు సమయ పాలన కంటే గంట ఆలస్యంగా తెరవడంతో పాటు గంట ముందుగానే షాపులను మూసివేస్తారు. ఇలా సమయపాలన ఉల్లంఘిస్తూ మండలాల్లోని గ్రామ గ్రామాన బెల్ట్ షాపులను ప్రోత్సహిస్తున్నారు. ఈ క్రమంలో అడ్డగోలు విక్రయాలు జరుపుతున్నారు. వైన్ షాపులోనే అధిక ధరలకు విక్రఇస్తున్నారని మందు బాబుల నుండి ఎక్సయిజ్ శాఖకు పలు ఫిర్యాదులు వెళ్లిన సంగతి తెలిసిందే. అయితే కంచే చేను మేసింది అన్న చందంగా ప్రజల్ని కాపాడాల్సిన ఎక్సయిజ్ అధికారులు కనీసం పట్టించుకోకుండా ఉండటం గమనార్హం. సిండికేట్ దందా మూలంగా చండ్రుగొండ, అన్నపరెడ్డిపల్లి, మండలాల్లోని గ్రామాల్లో వీధి వీధినా బెల్ట్ షాపులు వెలిశాయి. ఈ బెల్ట్ శాపులకు ప్రత్యేక వాహనం ద్వారా మద్యాన్ని సరఫరా చేస్తున్నారు. వ్యాన్లల్లో పాల ప్యాకెట్లు సరఫరా చేసినంత ఈజీగా మద్యాన్ని ప్రతీ బెల్ట్ షాపుకి అందిస్తున్నారు. అంతే కాకుండా బెల్ట్ షాపులపైనా అజమాయిషీ చేస్తారు. ప్రత్యేక వాహనాలతో తిరుగుతూ మద్యం సరఫరా చేస్తారు. వీరు అందించే మద్యం సీసాలపై ప్రత్యేక స్టిక్కర్ ఉంటుంది. అది లేదంటే అంతే సంగతులు. లక్షల సరుకైనా స్వాధీనం చేసుకుంటారు.
బీర్లు, సహా కొన్ని బ్రాండ్లు కష్టమే..?
వాస్తవానికి అన్ని బీర్లు, వైన్, విస్కీ లకి సంబంధించి అన్ని రకాల బ్రాండ్లు వినియోగదారులకు అందుబాటులో ఉంచాలి. కానీ మద్యం షాపులలో కొన్ని రకాలు ఎక్కువ డిమాండ్ లేని మద్యం మాత్రమే అందుబాటులో ఉంటాయి. వినియోగదారునికి ఫలానా బ్రాండ్ బీరు కావాలంటే మద్యం షాప్ లో ఉండదు కానీ ఆ షాప్ నుండే సరఫరా జరిగే బెల్ట్ షాప్‌లో మాత్రం అందుబాటులో ఉంటాయి. ఇంత బహిరంగంగా దందా కొనసాగుతున్నా.. ఎక్సయిజ్ అధికారులు నామమాత్రపు దాడులు చేసి చేతులు దులుపుకోవడంపై ఎక్సైజ్ శాఖ అధికారులకు భారీగానే ముడుపులు అంది ఉంటాయని మందుబాబులు బహిరంగంగానే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఎక్సైజ్ శాఖ అధికారులు ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘించి బెల్ట్ షాపులకు విచ్చలవిడిగా మద్యం సరఫరా చేస్తున్న వైన్ షాపులపై చర్యలు తీసుకోవాలని. మండల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.