- ప్రేమ హత్య నిందితులను పట్టుకున్న పోలీసులు
- యువత చెడు మార్గాన వెళ్లకుండా మొదటి అడ్డుకట్ట వేసేది తల్లిదండ్రుల బాధ్యత : ఆర్మూర్ ఏసిపి ప్రభాకర్ రావు
నిజామాబాద్ జిల్లా: నందిపేట మండలం ఆంధ్రానగర్ గ్రామం వెంకటేశ్వర కాలనీకి చెందిన సౌతురి కార్తీక్ వయసు 21 సం: నందిపేట శివారు పలుగుట్ట ప్రాంతంలో బండరాళ్ల మధ్య హత్యకు గురై అస్తిపంజర రూపంలో బయటపడ్డా విషయం అందరికీ తెలిసిందే. మృతుని తల్లి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు అంతకులిద్దరిని అరెస్టు చేసి ఈరోజు నందిపేట పోలీస్ స్టేషన్ లో ఆర్మూర్ ఏసీపీ ఆధ్వర్యంలో పత్రిక సమావేశం ఏర్పరిచి హత్యా సంఘటనలను వివరించారు. సౌతురి కార్తీక్ 2021-09-20వ తేదీ నుండి కనబడుటలేదని, ఎపి కి వెళ్లి పని చేసుకుంటూ ఉన్నాడని కుటుంబ సభ్యులు అనుకున్నారని, కాని కార్తీక్ ని అదే గ్రామానికి చెందిన బాపట్ల రాజు, బొజ్జ హరిష్ లు ఇద్దరు కలిసి పలుగుట్ట ఎల్లమ్మ దగ్గర కార్తిక్ కు కల్లు తాగించి విజయనగరం గుట్ట నిర్మానుష్య ప్రాంతములో కొట్టిచంపి బండరాళ్ళ మద్య పడేశారని మృతుని తల్లి గత నెల 28వ తారీఖున ఫిర్యాదు చేసారని. ఆమె ఫిర్యాదు మేరకు నిందితులను అరెస్టు చేయడం జరిగిందన్నారు.
నిందితుడు రాజు ప్రేమించిన అమ్మాయిని కార్తిక్ కూడా ప్రేమిస్తున్నాడనే అనుమానంతో కార్తీక్ ను చింపేసిన విషయం మృతుని మిత్రులు తల్లి కి తెలపడంతో ఆమె పిర్యాదు మెరకు సంఘటన స్థలానికి చేరుకొని మృతుని అస్థిపంజరం గుర్తించి ఫోరెన్సిక్ HOD నాగ మోహన్ రావు సమక్షంలో స్పాట్ పోస్ట్ మార్టం చేయించామనన్నారు. నిందితులు తెలిపిన వివరాల ప్రకారం తాను ప్రేమించిన అమ్మాయిని కార్తీక్ కూడా ప్రేమిస్తున్నాడని, కార్తీక్ ను అడ్డు తొలగిస్తే తను ప్రేమించే అమ్మాయిని పెళ్లి చేసుకోవచ్చని కార్తీక్ ను తన తమ్ముడు సహాయంతో పథకం ప్రకారం నందిపేట శివారు ఎల్లమ్మ ఆలయం వద్ద గల కెనాల్ ప్రాంతంకు తీసుకువెళ్లి కల్లు తాగించి కర్రతో కొట్టి చాతిపై తన్ని చంపేసామని అనంతరం దగ్గరలో గల రాళ్లలో పడేసి వెళ్ళమని పోలీసు విచారణలో తెలిపారని ఎసిపి ప్రభాకర్ రావు పత్రిక సమావేశంలో వివరించారు.
హత్య చేసినతరువాత ఇద్దరు మెట్ పల్లి వైపు వెళ్లి కూలి పని చేసుకుంటున్నారు, ఇద్దరు తాగిన మైకంలో స్నేహితులతో హత్య విషయం చెప్పడంతో బయటపడిందని తెలిపారు. ముఖ్యంగా యువతీ యువకులు తల్లిదండ్రులు తమ పిల్లల ప్రవర్తనను నిత్యం గమనిస్తూ ఉండాలని, చెడు మార్గాల వైపు వెళ్లకుండా జాగ్రత్త తీసుకోవాలని, తమ పిల్లల భవిష్యత్తును కాపాడే విధంగా, వారు చెడు వ్యసనాలకు గురికాకుండా మొట్టమొదటిగా తల్లిదండ్రులు అడ్డుకట్ట వేసేవిధంగా ఉండాలని సూచించారు. తమ తమ పిల్లల అలవాట్లలో ఏదైనా సందేహం కలిగినట్లైతే మాకు సమాచారము చేరవేయాలని, అటువంటి వారికి కౌన్సిలింగ్ ఇచ్చి సన్మార్గంలో నడిచేందుకు ప్రయత్నం చేస్తామని తెలిపారు.