- ప్రేమ మత్తులో 25 ఏళ్లకే నిండు నూరేళ్ళ జీవితాన్ని అర్దాంతరంగా ముగించుకున్నాడు ఓ యువకుడు.
- తల్లిదండ్రులకు కడసారి కోరిక తెర్చాల్సిన పుత్రుడు పుట్టెడు శోకాన్ని మిగిల్చి అనంత లోకాలకు వెళ్ళిపోయాడు అందుకు కారణం : ప్రేమ.
- కోవిడ్ సమయంలో విశ్రాంతి తీసుకోకుండా రోగులకు అలుపెరగని సేవ చేసి అందరి ప్రేమాభిమానాలు పొందిన ఆసుపత్రి ఎఫ్.ఎన్.ఓ
కృష్ణాజిల్లా గుడివాడకు చెందిన పరంగి వరుణ్ కుమార్ మచిలీపట్టణం ప్రభుత్వ ఆసుపత్రిలో ఎఫ్.ఎన్.ఓ. కోవిడ్ సమయంలో రోగులకు శక్తివంచన లేకుండా సేవ చేసిన వ్యక్తి. బ్రహ్మ కైనా పుట్టును రిమ్మ తెగులు అన్నట్లుగా వరుణ్ ఓ యువతి తో ప్రేమలో పడ్డాడు. పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకోవాలి అనుకున్నాడు కానీ ఆ ప్రయత్నాలు ఫలించలేదు. నిన్న ఆ యువతికి మరో వ్యక్తితో వివాహం కూడా జరిగిపోయింది. అది జీర్ణించుకోలేని వరుణ్ పురుగుల మందు త్రాగి ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు.
ప్రాణాపాయ స్థితిలో ఉన్న వరుణ్ ను కాపాడేందుకు మచిలీపట్టణం ప్రభుత్వ వైద్యులు సర్వశక్తులు ఒడ్డారు అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.
యువతా ఒక్కక్షణం ఆలోచించండి. బలవన్మరణానికి పాల్పడి బౌతికంగా మీరు దూరం కావచ్చు. కాని మీపై నమ్మకం పెట్టుకుని బ్రతికున్న మీ తల్లిదండ్రులకు మీరు జీవితకాల శిక్ష విధిస్తున్నారు. మిమ్మల్నే తలుచుకుంటూ రోదిస్తూ వారు జీవితాంతం నరకం అనుభవిస్తున్నారు అని మరువకండి. ప్రేమించడం తప్పుకాదు కాని పెద్దవాళ్ళను ఒప్పించుకునే ప్రయత్నం చేయండి.