మదనపల్లి :దేశ స్వాతంత్ర పోరాటంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎందరో మహనీయులు ప్రాణాలు అర్పించారని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ నాయకులు ఎస్. రెడ్డీ సాహెబ్ పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రెడ్డీ సాహెబ్ ఆద్వర్యంలో 78 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి జాతీయ జండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎస్.రెడ్డీ సాహెబ్ మాట్లాడుతూ దేశానికి స్వాతంత్ర్యం సిద్దించి 78 సంవత్సరాలైతే కాంగ్రెస్ పార్టీ స్దాపించి 140 సంవత్సరాలైందన్నారు. దేశ స్వాతంత్ర పోరాటంలో క్రియాశీలక పాత్ర పోషించి దేశానికి స్వాతంత్రం వచ్చిన తరువాత దేశాన్ని అభివృద్ధిలో ముందుకు నడిపిన గాంధి, నెహ్రూ కుటుంబాల పాత్ర ఎంతో వుందన్నారు. ప్రస్తుతం దేశం అభివృద్ధిలో ముందుకు వెళుతుంది అంటే అది కేవలం కాంగ్రెస్ పార్టీ ప్రధాన మంత్రులు చేసిన కృషి వల్లనే అని అన్నారు. జవహర్ లాల్ నెహ్రూ, ఇందిరా గాంధీ, రాజీవ్‌గాంధీ, పి.వి.నరసింహారావు, మన్మోహన్ సింగ్ ఇలా ప్రతి ఒక్కరూ దేశ అభివృద్ధిలో తమ ముద్ర వేశారని వివరించారు. సాగునీటి రంగంలో నిర్మించిన ప్రాజెక్టులు, విద్య రంగంలో నిర్మించిన యూనివర్సిటీలు, వైద్య రంగంలో నిర్మించిన ఆసుపత్రులు, మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయడం ద్వారానే అభివృద్ధి జరిగిందన్నారు. 78 సంవత్సరాల స్వాతంత్ర భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ బలహీన వర్గాల పక్షాన, పేదల పక్షాన పోరాటం చేసి వారికి కూడు గుడ్డ ఇల్లు కల్పించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని అన్నారు. కానీ ప్రస్తుతం బీజేపీ పార్టీ దాని అనుబంధ సంస్దలకు కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి కనబడకుండా అబద్దపు ప్రచారాలను చేస్తూ చరిత్రను వక్రీకరిస్తూ కాంగ్రెస్ పార్టీ విలువను తగ్గించే ప్రయత్నం చేస్తున్నాయని దీనిని ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ చేసిన భారత్ జోడో పాదయాత్ర దేశాన్ని ఐక్యంగా ఉంచడానికి మరో ముందడుగు అన్నారు. భావితరాల భవిష్యత్తు కోసం మరో స్వాతంత్ర్య ఉద్యమం చేసి రాహుల్ గాంధీ ప్రదానమంత్రి చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఐ రెడ్డి శేఖర్, ఆప్ రహీం, నిమ్మనపల్లె మండల అధ్యక్షులు ముబారక్ ఖాన్, రామసముద్రం మండల అధ్యక్షులు ఖాదర్ బాషా, మీనా కుమారి, సోమశేఖర్, శరత్ కుమార్ రెడ్డి, మహబూబ్ పీర్, మహమ్మద్, భయారెడ్డి, అన్వర్, ఈశ్వరమ్మ, అర్భాజ్, ఖాసీం, పాలేటి, సమీర్ తదితరులు పాల్గొన్నారు.