పల్నాడు జిల్లా, మాచవరం : మండల కేంద్రమైన మాచవరం లో ఎన్నికలకు ముందు నుండి తాసిల్దార్ గా విధులు నిర్వర్తించిన శ్రీరామచంద్ర మూర్తి బదిలీపై ప్రకాశం జిల్లా వెళ్తున్నారు. ఈ సందర్భంగా, టిడిపి నాయకులు యడ్లపల్లి రామారావు, పుసులూరి రామయ్య, చిట్టిప్రోలు నరసింహారావు, సయ్యద్ అబ్దుల్లా, గుదే వెంకటేశ్వర్లు, కాసిమాల సౌరి బాబు, యు సత్యనారాయణ లు తాసిల్దార్ ని ఘనంగా సన్మానించి,జ్ఞాపీక ను అందించారు. తాసిల్దార్ శ్రీరామచంద్రమూర్తి సేవలను మండల నాయకులు యడ్లపల్లి రామారావు కొనియాడారు.