పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం మాచర్ల పట్టణంలోని పెన్షనర్స్ అసోసియేషన్ భవనం నందు శ్రీ వీరబ్రహ్మేంద్ర జాతీయ ప్రజా హక్కుల పరిరక్షణ సమితి మరియు దళిత బహుజన సంక్షేమ సేవా సంఘం, దళిత ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మన్యం విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు 126వ జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మొదటిగా అల్లూరి సీతారామరాజు చిత్రపటానికి పూలమాలలు వేసి జోహార్ అల్లూరి సీతారామరాజు కొనసాగిస్తాం అల్లూరి సీతారామరాజు ఆశయాలను అంటూ నినాదాలు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి శ్రీ వీరబ్రహ్మేంద్ర జాతీయ ప్రజా హక్కుల పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షులు గురజాల అప్పారావు అధ్యక్ష వహించి మాట్లాడుతూ అల్లూరి సీతారామ రాజు జయంతి కార్యక్రమాన్ని జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు.
ఈ సందర్భంగా ఎంసీపీఐ యు రాష్ట్ర కమిటీ సభ్యులు మాచవరపు నాగేశ్వరావు మాట్లాడుతూ బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాటం చేసి తెల్ల దొరల గుండెల్లో వణుకు పుట్టించిన వీరుడు అల్లూరి సీతారామరాజు గారు అని అన్నారు
ఈ సందర్భంగా దళిత బహుజన సంక్షేమ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షులు కుక్కమూడి ప్రసాద్ మాట్లాడుతూ అగ్గిపిడుగు, మన్యం విప్లవ వీరుడు తెలుగుజాతి పౌరుషాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన వీరుడు అల్లూరి సీతారామరాజు గారు అని, మన్యం ప్రజల మాన ప్రాణాల రక్షణకు ప్రాణత్యాగం చేసినటువంటి యోధుడు అల్లూరి సీతారామరాజు గారు ఆయన ఆశయాలను ఆయన పోరాటాలను ఆదర్శంగా తీసుకొని ముందుకెళ్లాలన్నారు.
ఈసందర్భంగా డప్పు జానపద కళాకారుల రాష్ట్ర అధ్యక్షుడు ఆదిరాల ఆదాం మాట్లాడుతూ అల్లూరి సీతారామరాజు గారు ఈ భారతదేశ ప్రజల కోసం ఆయన శరీరంలోన ఆఖరి రక్తపు బొట్టు వరకు పోరాటం చేసినటువంటి విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు గారు అని అన్నారు.
ఈసందర్భంగా బీసీ సంఘం మాచర్ల నియోజకవర్గం మహిళా నాయకురాలు కొరదల జ్యోతి మాట్లాడుతూ అల్లూరి సీతారామరాజు గారిని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని వారి సేవలను కొనియాడారు.
తదనంతరం ఈ కార్యక్రమంలో పాల్గొన్న దళిత బహుజన ప్రజా సంఘాల నాయకులంతా మాచర్ల పట్టణంలో మన్యం విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు గారి విగ్రహాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేయాలని తీర్మానించడం జరిగింది
ఈ కార్యక్రమంలో డేరంగుల రమణ కొరదల సాంబశివరావు పాల్గొన్నారు