- చట్టానికి లోబడే విధులు నిర్వహిస్తున్నాం
- జిల్లా యంత్రాంగాన్ని నడిపిస్తున్న ఎస్పీ పై ఆరోపణ చేయటం హేమమైన చర్య
- మాచర్ల అర్బన్ సిఐ బాలకృష్ణ.
పల్నాడు జిల్లా మాచర్ల : ( ది రిపోర్టర్ టివి ): ఏపీ పోలీసులు చట్టానికి లోబడే విధులు నిర్వహిస్తున్నాం, ఇష్టానుసారం చేయాలంటే పై అధికారులకు న్యాయస్థానాలకు సమాధానం చెప్పాల్సి వస్తుందని మాచర్ల అర్బన్ సిఐ బాలకృష్ణ పేర్కొన్నారు. మాచర్ల పట్టణ పోలీస్ స్టేషన్లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు ప్రముఖ దినపత్రికలో మాచర్లలో తలదించుకున్న ఖాకీ కథనంపై ఆయన మండిపడ్డారు. భారతదేశంలోనే నెంబర్ వన్ గా ఏపీ పోలీసులు పని చేస్తున్నారని ఓ సర్వేలో వెల్లడించారని, అలాంటిది పోలీసులపై ఇలా కథనాలు రాయడం హాస్యాస్పదంగా ఉందని ఆయన యద్దేవా చేశారు.జిల్లా ఎస్పీ బాధ్యతలు చేపట్టి సుమారు 15 నెలల కాలం అయ్యింది ,అప్పటినుండి శాంతి భద్రతల సమస్యలు తలెత్తకుండా సమర్థవంతంగా జిల్లా యంత్రాంగాన్ని నడిపిస్తున్న వ్యక్తిపై తప్పుడు రాతలు రాయడం మంచి పద్ధతి కాదని అన్నారు. పలనాడు ప్రాంతంలో పెద్ద తిరునాళ్ల జరిగే సమయంలో భారీ బందోబస్తులను ఏర్పాటు చేసి, ఎటువంటి గొడవలు జరగకుండా అనుక్షణం పర్యవేక్షిస్తున్న జిల్లా ఎస్పీ పై తప్పుడు రాతలు రాయడం మానుకోవాలని తెలిపారు.