వరికపూడిసెల ప్రాజెక్టు సందర్శనకు మంగళవారం రైతులు భారీగా తరలి రావాలని మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కోరారు ముందుగా ఉదయం 09:30 గంటలకు మాచర్ల పట్టణంలో గల ప్రభుత్వ వైద్యశాల నందు నూతనంగా నిర్మించిన 50 పడకల భవనం ప్రారంభోత్సవం జరుగుతుందని. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా భారీ నీటపారుదలశాఖమంత్రి అంబటి రాంబాబు, పార్లమెంట్ సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు,జిల్లా కలెక్టర్ లోతేటి శివ శంకర్ పాల్గొంటారు. ఆనంతరం అందరు కలిసి, జులై మొదటి వారంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ వై.యస్. జగన్మోహనరెడ్డి గారి చేతుల మీదుగా శంకుస్థాపన చేయనున్న వరికపూడిశెల ప్రాజెక్ట్ నిర్మాణం జరిగే ప్రాంతాన్ని సందర్శించనున్నారు. కావున రైతు సోదరులు, పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, వేలాదిగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాను.