మదనపల్లి : గత ఐదు సంవత్సరాల వైసిపి పాలనలో అన్ని వ్యవస్థలు నిర్వీర్యం అయ్యాయని, మున్సిపాలిటీ కి రావాల్సిన నిధులు కూడా పక్కదారి పట్టించి, అభివృద్ధిని మరిచిందని మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ భాష అన్నారు. శనివారం మదనపల్లి మునిసిపల్ ఎక్స్ అఫిషియో సభ్యులుగా ప్రమాణస్వికారం చేసిన ఆయనకు కౌన్సిలర్లు శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా షాజన్ భాషా మాట్లాడుతూ… రానున్న రోజుల్లో ప్రతి ఒక్క సభ్యుడు మదనపల్లి ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు ముందుకు రావాలని ఆయన కోరారు. అంతకుముందు నగరంలో కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు.