మదనపల్లి : వైద్యుల నిర్లక్ష్యానికి ప్రయివేట్ ఆసుపత్రిలో ఓ పసికందు మృత్యువాత పడింది. ఈ ఘటన శనివారం రాత్రి మదనపల్లి రెయిన్ బో ఆస్పత్రి వద్ద జరిగింది.కర్ణాటక రాష్ట్రం చేలూరికి చెందిన దంపతులు శంకర, లలిత లు తన మూడు నెలల పురిటి బిడ్డను తీసుకొని ఆస్పత్రికి వచ్చారు. డాక్టర్ లేకపోయినప్పటికీ ఆసుపత్రిలో రక్త పరీక్షలు, వివిధ రకాల టెస్టల పేరుతో కాలయాపన చేశారు. ఆ సమయంలో డాక్టర్ లేకపోవడం, డాక్టర్ ఆలస్యంగా వచ్చినా ఆ బిడ్డకి డాక్టర్ వైద్యం అందించక పోవడంతో, హాస్పిటల్ లోనే డాక్టర్ ల నిర్లక్ష్యానికి పసికందు కన్ను మూసింది. దీంతో మృతుని తల్లిదండ్రులకు ఆగ్రహం కట్టలు తెంచుకుంది. తమ బిడ్డ మరణానికి వైద్యలే కారణమని ఆసుపత్రి వద్ద బైఠాయించి తమ బిడ్డను అన్యాయంగా పొట్టణ పెట్టుకున్నారని నిరసనకు దిగి ఆందోళన చేపట్టడంతో వివాదం నెలకొంది.