మదనపల్లి: నేడు రాష్ట్రంలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ఒక పండుగ వాతావరణంగా జరిగిందని చెప్పుకోవచ్చు. వృద్ధాప్య పెన్షన్ గతంలో 3000 రూపాయలు ఇస్తుండగా నూతనంగా రాష్ట్రంలో ఏర్పడిన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆమె మేరకు వేయి రూపాయలు పెంచి 4000 రూపాయలు ప్రతినెల ఇవ్వనుంది, అదనంగా ఏప్రిల్ మే జూన్ నెలలో కూడా వెయ్యి రూపాయలు చొప్పున 3000 రూపాయలు, మొత్తంగా 7000 రూపాయలు నేరుగా లబ్ధిదారులకు ఇచ్చేటువంటి కార్యక్రమం నేడు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి నేరుగా పెన్షనల్లో దగ్గరికి వెళ్లి పెన్షన్ అందివ్వడం జరిగింది. అదేవిధంగా మదనపల్లి లో ఎమ్మెల్యే షాజహాన్ భాష మరియు పార్టీ నాయకులు కార్యకర్తలు పెన్షన్ దారుల ఇంటికి వెళ్లి నేరుగా పెన్షన్ అందించడం జరిగింది.