అన్నమయ్య జిల్లా, మదనపల్లి : గంజాయి అమ్మినా , రాష్ డ్రైవింగ్ చేసినా , భూములు ఆక్రమించినా,ఎవరిని వదలమని మదనపల్లి డీఎస్పీ కొండయ్య నాయుడు అన్నారు.బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మదనపల్లి పట్టణంలో యువత ఎక్కువగా గంజాయి తాగుతున్నారని, రాష్ డ్రైవింగ్ చేయటం తమ దృష్టికి వచ్చింది అని, కాలేజీ, స్కూల్ పరిసర ప్రాంతాలలో సిగరెట్, బీడి, గుట్కా, వంటివి అమ్మకుండా చర్యలు తీసుకుంటామని, అదే విధంగా భూములు ఆక్రమణ చేసిన వారి పైన కూడా కేసులు నమోదు చేస్తామని, మీడియా, ప్రజ సంఘాలు, రాజకీయ నాయకుల ముసుగులో పోలీసు స్టేషన్ వద్ద సెటిల్ మెంట్ చేసే వారి పైన నిఘా ఉంచామని అన్నారు. అలాంటి వారిపైన కూడా చర్యలు తప్పవని, మదనపల్లి ట్రాఫిక్ పైన కూడా దృష్టి పెట్టి రికార్డులు లేని వాహనాలను సీజ్ చేస్తామని తెలిపారు.