మదనపల్లి :స్థానిక చైతన్య స్వచ్ఛంద సేవా సంస్థ నడపబడుతున్న ముత్తు ఆంగ్ల మాధ్యమ పాఠశాల మరియు ఆనంద వృద్ధాశ్రమం ఆధ్వర్యంలో ప్రముఖ పారిశ్రామికవేత్త శశిధర్ రావు {శ్రీకృష్ణ థియేటర్స్ యజమాని } చేతులు మీదుగా వ్యవస్థాపక అధ్యక్షులు ఎంపీ ఆనందం తో కలిసి పతాకావిష్కరణ కావించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంతోమంది మేధావులు త్యాగమూర్తులు విప్లవ వీరులు వీర వనితలు ధన మాన ప్రాణాలను సాధించి పెట్టిన స్వేచ్ఛ స్వతంత్రాలను శిఖరమైన మార్గంలో పెట్టుకొని భారతదేశాన్ని ప్రపంచంలో అగ్రగామి నిలపాలని 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. టూ టౌన్ పోలీస్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ మరియు రేవతి ఫౌండేషన్ అధినేత రామమూర్తి ప్రత్యేక అతిథిగా విచ్చేసి చిన్నారులకు తనదైన శైలిలో ఒప్పించి మెప్పించి ఉత్సాహపరిచి స్వాతంత్రోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. తదుపరి ముత్తు ఆంగ్ల మాధ్యమం పాఠశాల చిన్నారుల ఆటలు పాటలు మరియు నృత్య ప్రదర్శనలతో స్వాతంత్రం స్వాతంత్ర వచ్చే వేడుకలు కోలాహలంగా జరిగాయి. సంస్థ అడ్మినిస్ట్రేటివ్ డైరెక్టర్ డాక్టర్ జివిఎస్ బాబు మాట్లాడుతూ క్రమశిక్షణ గల జీవితానికి కాలమే డబ్బు కాబట్టి ప్రతి ఒక్కరు సరైన సత్ప్రవర్తనతో గుణగణాలతో సమాజానికి హితం చేయాలని ఎంతోమంది మేధావుల త్యాగ ఫలితం సఫలీకృతమయ్యేలా నడుచుకోవాలని,ఎక్కడైతే స్త్రీ గౌరవింపబడుతుందో అక్కడ దేవతలు నివిసిస్తారని ప్రతి ఒక్కరూ వారి వారి కుటుంబాలతో పాటు భారతదేశంలో ఒక వైశుదైక కుటుంబం అని అన్నారు. తెలిపారు. సంస్థ జనరల్ సెక్రెటరీ కవిత రాణి మాట్లాడుతూ 77 వసంతాల స్వేచ్ఛ స్వాతంత్ర భారతంలో ఇంకా కూడా సమానత్వం లేక ఎంతోమంది మహిళలు నిరాదరణకు గురవుతూ ఆయా రంగాల్లో ఉన్న మహిళలు ఎదగకుండా చేస్తున్నారని శ్రామికులుగా పనిచేస్తున్న మహిళలకు కూడా రోజువారీ కూలీ లో కూడా అసమానత్వం పాటిస్తూన్నారని అన్నారు.
సంస్థ కోశాధికారి ముత్తు ఆంగ్ల మాధ్యమ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు పట్నం గిరిజమ్మాల్ మరియు వ్యవస్థాపక అధ్యక్షులు ఎంపీ ఆనందన్ మాట్లాడుతూ మన భారత భూమి వేద భూమి కర్మభూమి ఈ జన్మభూమిలో పుట్టిన ప్రతి ఒక్కరు జన్మభూమి ఋణం తీర్చుకోవాలని సమాజంలో ఉన్న ఏ ఒక్కరు కూడా నిరాధారణకు గురి కాకూడదని అదే లక్ష్యంతో మన సంస్థ నడుపుతున్నామని సమాజంలో ఉన్న అందరి సహా సహకారాలతో ఈ సంస్థ నడుపుతున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో వాసు దేవ నాయుడు జీవదాత ఫ్రెండ్స్ గ్రూప్ సభ్యులు జై భీమ్ ఫౌండేషన్ సభ్యులు మరియు ముత్తు ఆంగ్ల మాధ్యమ పాఠశాల విద్యార్థినీ విద్యార్థులు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు రెడ్డి ప్రసన్న గౌస్య బేగం అజయ్,
రెడ్డి శేఖర్ జనార్ధన్ వెంకటేశ్వర ప్రసాద్ మరియు ఆనంద వృద్ధాశ్రమ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.