మదనపల్లి : ప్రజలకు ఇసుక అందకుండా చెయ్యటం, భవన నిర్మాణ కార్మికులను ఇబ్బందులకు గురి చేయడం ద్వారా కొత్తగా ఏర్పడిన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వానికి ఇబ్బందులు కలుగజేయడానికి సిపిఎం నాయకులు ప్రయత్నం చేస్తున్నారని ఇది మంచి పద్ధతి కాదని ఆర్‌జే వెంకటేష్ సూచించారు. ప్రజలలో ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకువచ్చే ప్రయత్నాలు మానుకోవాలని లేనిపక్షంలో ప్రజలే తగిన బుద్ధి చెబుతారని పేర్కొన్నారు. మదనపల్లె చూట్టూ ఇసుక రీచులు లేని పరిస్థితులలో అందుబాటులో వున్న చోటు నుంచి ఇసుక తెచ్చుకొని భవన నిర్మాణానికి డంపు చేసుకోవడం ఎప్పటి నుంచో జరుగుతుంది, దీనిపై సిపిఎం నాయకులు అవగాహన ఆరోపణలు చేసి అభాసుపాలు అయ్యారు.
అధికారంలో ఉన్న సమయంలో ప్రజాధనం దుర్వినియోగం చేసిన చరిత్ర హినుడు జగన్:-
ఐదు సంవత్సరాల వైసిపి ప్రభుత్వ పాలనలో సిఎంగా వున్న జగన్మోహన్ రెడ్డి ప్రజా ధనాన్ని లూటి చేసి రాష్ట్రన్ని బ్రస్టు పట్టించాడని ఆర్‌జే వెంకటేష్ విమర్శలు గుప్పించారు. ఏ శాఖ చూసిన, ఎక్కడ చూసినా ప్రజా ధనం దుర్వినియోగం చేసిన ఆనవాళ్ళు స్పష్టం కనిపిస్తున్నాయని వివరించారు. ముఖ్యంగా సొంత భద్రత కోసం 980 వినియోగించి వారికి ప్రతి నెల రూ.6 కోట్లు ఖర్చు పెట్టడం జగన్మోహన్ రెడ్డి దుబారా పాలనకు నిదర్శనం అన్నారు. ఐదు సంవత్సరాలలో భద్రత కోసం ఖర్చు చేసిన సుమారు 350 కోట్లుతో ఒక ప్రాజెక్టు నిర్మించి వుండవచ్చు అన్నారు. మరోవైపు వైజాగ్ బీచ్ సమీపంలో ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేని 450 కోట్లుతో నిర్మించిన విలాస భవనం జగన్మోహన్ రెడ్డి చేతగాని పాలనకు నిదర్శనం అన్నారు. జగన్మోహన్ రెడ్డి పాలన మొత్తం ప్రజా ధనం దుర్వినియోగానికి గురైందన్నారు.