మదనపల్లి: ముఖ్యమంత్రిగా నాలుగవసారి ప్రమాణస్వీకారం చేస్తున్నటువంటి నారా చంద్రబాబు నాయుడుకి మరియు ఎన్డీఏ కూటమి విజయానికి నిదర్శనంగా మదనపల్లి లోని నిమ్మలపల్లి సర్కిల్ నందు చంద్రబాబు నాయుడు ప్రమాణస్వీకారం చేసే సమయంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కంచర్ల శ్రీనివాసులు నాయుడు వేద పండితుల చేత వేదమంత్రాలతో గణపతి హోమం మరియు నవగ్రహాల హోమం నిర్వహించి అధిక సంఖ్యలో మహిళల చేత విజయ హారతులు పట్టించారు. ఈ సందర్భంగా కంచర్ల శ్రీనివాసులు నాయుడు మాట్లాడుతూ… రాష్ట్రంలోని ప్రజలు గత ఐదు సంవత్సరాల వైసిపి అరాచక పాలనకు స్వస్తి పలికి రాష్ట్ర అభివృద్ధికి, యువత భవిష్యత్తుకి పట్టం పలికారని, అందుకు అనుగుణంగా నారా చంద్రబాబునాయుడు నేతృత్వంలో రాష్ట్ర అభివృద్ధి పథంలో దూసుకుపోతుందనిఅన్నారు.ప్రస్తుత జరిగినటువంటి ఎన్నికల్లో విజయం సాధించడం, విజయానికి పెద్ద ఎత్తున మహిళలు విజయ హారతులు చేపట్టడం శుభ పరిణామమని అందుకు అనుగుణంగా రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు కేంద్రంలో ప్రధానమంత్రిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ ఇద్దరు కూడా పవన్ కళ్యాణ్ నేత్రుత్వంలో రాష్ట్ర అభివృద్ధికి కావలసినటువంటి అన్ని వనరులు చేకూరడమే కాకుండా రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడడం వల్ల రాష్ట్రంలోని పేద ప్రజలకే కాకుండా చదువుకున్నటువంటి యువతకి కావచ్చు అలాగే పరిశ్రమలు ఏర్పాటు కావచ్చు మరియు పోలవరం లాంటి బృహత్కరమైన కార్యక్రమాలు విజయ పదంలో నడిచి అన్ని వర్గాల ప్రజలకు లబ్ధి చేకూరేలా పరిపాలన సాగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కంచర్ల చింటూ, జంషీర్, బద్రి,ఉమేష్ నాయుడు, వెంకటస్వామి, ప్రతాప్ రెడ్డి, లక్ష్మీనారాయణ, బలరాం రెడ్డి మరియు పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.