మదనపల్లి : నేడు పేస్ స్వచ్చంధ సంస్థ మరియు చైతన్య స్వచ్చంద సేవ సంస్థ ఆధ్వర్యంలో నడపబడుతున్న ముత్తూ ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు ” వన్ బిలియన్ యూత్ ఫర్ పీస్ ” కార్యక్రమంలో భాగంగా, విద్యార్థులచే ప్రపంచ శాంతి కొరకు ప్రతిజ్ఞ చేయించడం జరిగింది. హింసకు అణ్వాయుధాలకు వ్యతిరేకంగా పోరాడుతామని విద్యార్థులు ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధి గా యునైటెడ్ రెలిజియన్స్ ఇనిషియేటివ్ స్టేట్ ఆర్గనైజర్ మరియు పేస్ సంస్థ డైరెక్టర్ వి.యస్.రెడ్డి పాల్గొన్నారు.ప్రస్తుత తరుణంలో ప్రపంచ వ్యాప్తంగా హింస ప్రవృత్తి ప్రబలిపోతోందని ఇది అశాంతికి దారితీస్తోందని దీని పరిణామాలు ముందు ముందు భయంకరంగా ఉండబోతున్నాయని, హింసకు అందరూ దూరంగా ఉండాలన్న విషయాన్ని విద్యార్థులకు బోధిస్తున్నామని ఆయన అన్నారు. చైతన్య సర్వీస్ సొసైటీ అధ్యక్షులు యం. పి.ఆనందన్ మాట్లాడుతూ, శాంతిస్థాపన కోసం అందరూ కృషిచేయాలని కోరారు. ఈ కార్యక్రమములో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఏ. కృష్ణ చరణ్, ట్రెజరర్/ కరెస్పాండంట్ పట్నం గిరిజమ్మాల్ ,ముత్తూ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ప్రిన్సిపాల్ ఏ.కవితరాణి ,అడ్మినిస్ట్రేటివ్ డైరెక్టర్ జి.వి.ఎస్.బాబు, ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.