ప్రకాశం జిల్లా / మద్దిపాడు : నూతన ఎస్సైగా మద్దిపాడు పోలీస్ స్టేషన్ లో బి.శివరామయ్య. సోమవారం బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ముఖ్యంగా మండలంలో మహిళలకు రక్షణ కల్పించేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడిన సహించబోయేది లేదని, గంజాయి విక్రయాలు జరగకుండా అన్ని చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు. ఏ సమస్యలు ఉన్నా ప్రజలు తమ వద్దకు వచ్చి నేరుగా ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు.