పల్నాడు జిల్లా పిడుగురాళ్ల : నిన్న జానపడు నుండి అక్రమ మట్టి తరలింపు నేడు పిడుగురాళ్ల నుండి జానపడుకి అక్రమ మట్టి తరలించండం జోరుగా సాగుతుంది . వార్తలు అనేవి ప్రభుత్వానికి ఇటు ప్రజలకు వారధిగా పని చేసేవి. స్థానిక అక్రమాలపై, సమస్యల పై వార్తలు ప్రచురించేది ప్రభుత్వ అధికారులు స్పందించడానికి. చట్ట వ్యతిరేక పనులు జరిగినప్పుడు అవి అరికట్టడానికి ప్రభుత్వ అధికారులు స్పందించడానికి. కానీ ఇష్టానుసారంగా వ్యవరించడానికి కాదు. చట్ట వ్యతిరేక పనులకు సహకరించిన, చూసీచూడనట్టు వ్యవహరించిన చట్ట పరమైన చర్యలకు లేదా శాఖ పరమైన చర్యలకు గురికావలసిందే. అది జిల్లా కలెక్టరైనా లేదా కింది స్థాయిలో పని చేసే ఉద్యోగైనా. చట్టం ఎవరికి చుట్టం కాదని గమనించాలని ఉన్నతాధికారులు గమనించాలి. ఇకనైనా అధికారులు స్పందించి మట్టి మాఫియా పై చర్యలు తీసుకోవాల్సిందిగా స్థానికులు కోరుతున్నారు.
