contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

జానపాడు లో రెచ్చిపోతున్న మట్టి మాఫియా – పట్టించుకోని అధికారులు

పల్నాడు జిల్లా: జనపాడు లో రెచ్చిపోతున్న మట్టి మాఫియా వివరాల్లోకి వెళితే పల్నాడు జిల్లా పిడుగురాళ్ల మండలం జానపడు పెద్ద చెరువు మట్టిని అక్రమంగా తరలిస్తున్నారు. రెండేళ్ల క్రితం చెరువు పూడిక తీసి చెరువు పక్కన వేసిన మట్టిని ఎలాంటి అనుమతులు లేకుండా గత రెండు రోజులుగా అడ్డగోలుగా అక్రమ రవాణా చేస్తున్నారు . అడిగేవారే లేరు ? అడ్డుకునే దమ్ము ఎవరికీ లేదు. రెవెన్యూ , మైనింగ్ అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు. భూమి కనిపిస్తే చాలు మట్టిని తోడేస్తున్నారు. ఇంత పెద్ద మొత్తంలో మట్టి మాఫియా జరుగుతున్నప్పటికీ అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు. ఇకనైనా అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాల్సిందిగా స్థానికులు కోరుతున్నారు.

పిడుగురాళ్ల ఎమ్మార్వో ఆఫీస్ పక్కన ఉన్నటువంటి ఇటుక బట్టలకు మట్టిని తరలిస్తున్నారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :